ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డిపై మండిపడ్డ అయ్యన్నపాత్రుడు

ABN, First Publish Date - 2023-02-24T14:42:05+05:30

విశాఖ: ఆంధ్రా యూనివర్శిటీ వీసీ ప్రసాద్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఆంధ్రా యూనివర్శిటీ (Andhra University) వీసీ (Vice Chancellor) ప్రసాద్ రెడ్డి (Prasad Reddy)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyanna Pathrudu) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ కోడ్‌ (MLC Code)ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారన్నారు. ప్రైవేట్ హోటల్‌లో సమావేశం నిర్వహించి.. ఓట్లు వేయకపోతే విద్యా సంస్థలు మూయిస్తామని వీసీ బెదిరించారని ఆరోపించారు. ఏయూని వైసీపీ కార్యాలయం (YCP Office)గా ప్రసాద్ రెడ్డి మార్చేశారని విమర్శించారు. వైసీపీ నేతల బర్త్ డే కేకులను వీసీ కట్ చేయ లేదా? అని ప్రశ్నించారు.

జీవీఎంసీ ఎన్నికల్లో (GVMC Elections) ఏయూ నుంచే ప్రసాద్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. వీసీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ (EC)కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫేక్ ఓట్లు (Fake Votes) ఉన్నాయని.. వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఏయూలో గంజాయి (Marijuana) దొరికితే ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. యూనివర్శిటీలో జరిగే అక్రమాలపై మాట్లాడితే.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు. ఇలా బెదిరింపు కాల్స్ చేయడానికి ఒక బ్యాచ్‌ను ఏర్పాటు చేశారని, అక్రమాలకు పాల్పడుతున్న వీసీ ప్రసాద్ రెడ్డిని రీ కాల్ చేయాలని అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-02-24T14:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising