ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandaru Satyanarayana: ఆరు నెలలు తర్వాత ఎస్పీ సంగతి చూస్తాం... రీకాల్ చేయాల్సిందే

ABN, First Publish Date - 2023-08-05T14:07:50+05:30

సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

విశాఖపట్నం: సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ (Former Minister Bandaru Satyanarayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ (CM Jagan)ఒక మూర్ఖుడు అని.. మంత్రి పెద్దిరెడ్డి (Minster Peddireddy Ramachandrareddy) కపట సన్యాసి అని అన్నారు. రాష్ట్ర మైనింగ్ అంతా పెద్దిరెడ్డి చేతిలో ఉందని.. విశాఖ మైనింగ్‌లో కూడా ఆయనదే హవా అని ఆరోపించారు. పెద్దిరెడ్డి మాలలు వేసి... దైవాన్ని అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. పులివెందులలో బాబుకు జనం నీరాజనం పట్టడంతో... జగన్, పెద్దిరెడ్డి చమటలు పట్టాయన్నారు. అందుకే పుంగనూరులో చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) చంపాలని అనుకున్నారో, దాడి చేయాలనుకున్నారు తెలియదని ఆయన అన్నారు.


పుంగనూరులో అరాచకం జరిగితే ఎస్పీ రిషాంత్ రెడ్డి కళ్ళు మూసుకున్నారని... పెద్దిరెడ్డి బూట్లు నాకుతున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు భద్రత, రక్షణ కల్పించకుండా ఎస్పీ చోద్యం చూశారన్నారు. ఎస్పీ బాగోతం తమకు తెలుసని.. పోలీస్ ప్రతిష్టను దిగజార్చారన్నారు. వైసీపీలో జాయిన్ అవాలంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలలు తర్వాత ఎస్పీ రిశాంత్ రెడ్డి సంగతి చూస్తామని.. అక్రమాలపై జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు, కార్యకర్తలు మీద దాడి జరిగితే.. టీడీపీ వారినే వేధిస్తారా అని మండిడ్డారు. ఈ ఘటనపై కేంద్రం, అమిత్ షాకు ఫిర్యాదు చేసామని.. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటనలో సెంట్రల్ ప్రొటెక్షన్ పోర్స్ కల్పించాలన్నారు. చంద్రబాబును హతమార్చాలని ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్లాన్ చేశారని.. ఆయనను రీకాల్ చేయాలని బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-05T14:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising