Visakha: టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల క్లస్టర్ సమావేశం నేడు
ABN, First Publish Date - 2023-04-05T10:30:10+05:30
విశాఖపట్నం: నగరంలో బుధవారం తెలుగుదేశం పార్టీ (TDP) ఉత్తరాంధ్ర జిల్లాల (Uttarandhra Districts) క్లస్టర్ సమావేశం (Cluster Meeting) జరగనుంది.
విశాఖపట్నం: నగరంలో బుధవారం తెలుగుదేశం పార్టీ (TDP) ఉత్తరాంధ్ర జిల్లాల (Uttarandhra Districts) క్లస్టర్ సమావేశం (Cluster Meeting) జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు (Atchannaidu), ముఖ్య నేతలు హాజరవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1.15 గంటలకు చంద్రబాబు విశాఖకు రానున్నారు. 2:15 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా వైఫల్యాలు, ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరో ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమయత్తం చేయటమే లక్ష్యంగా సభ జరగనున్నట్లు తెలియవచ్చింది. ఈ సమావేశానికి సుమారుగా 3వేల మంది నేతలు హాజరవుతున్నట్లు సమాచారం.
కాగా సీఎం జగన్‌కు చంద్రబాబు అంటే భయం పట్టుకుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న అన్నారు. ప్రజలు ఇంటికి సాగనంపుతారని జగన్‌కు తెలిసిపోయిందన్నారు. జగన్ రాక్షస పాలనతో చంద్రబాబు క్రెడిబిలిటీ పది రెట్లు పెరిగిందని చెప్పారు. వైసీపీ.. టైటానిక్ షిప్ లాంటిదని 2024లో మునిగిపోవడం ఖాయమని వెంకన్న అన్నారు. కుప్పంలో తమదే గెలుపు అని విర్రవీగారని, ఇప్పుడు పులివెందులలోనే వైసీపీ ఓడిపోయిందని, దానికి జగన్ బాధ్యత వహించాలని అన్నారు. వల్లభనేని వంశీ పార్టీ మారతారని ప్రచారం చేయించుకుంటున్నారని, ఆయన్ను, కొడాలి నానినీ ఏ పార్టీ కూడా తీసుకోదని, వారు వైసీపీతో పాటు భూ స్థాపితం కావలసిందేనని చెప్పారు. జగన్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం లేదని అందుకే ఈ ఏడాది దోచుకొమ్మని ఎమ్మెల్యేలకు సిగ్నల్ ఇచ్చారని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-04-05T10:30:10+05:30 IST