AP NEWS: యూట్యూబర్ లోకల్ బాయ్ నాని హార్బర్ ప్రమాదానికి కారణo కాదని పోలీసుల నిర్ధారణ
ABN, First Publish Date - 2023-11-20T20:43:13+05:30
యూట్యూబర్ లోకల్ బాయ్ నాని హార్బర్ ప్రమాదానికి కారణo కాదని విశాఖ పోలీసులు తెలిపారు. హార్బర్ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సోమవారం నాడు పోలీసులు మీడియాకు తెలిపారు.

విశాఖపట్నం: యూట్యూబర్ లోకల్ బాయ్ నాని హార్బర్ ప్రమాదానికి కారణo కాదని విశాఖ పోలీసులు తెలిపారు. హార్బర్ ప్రమాదానికి సంబంధించిన వివరాలను సోమవారం నాడు పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రమాద సమయంలో నాని అక్కడే ఉండి సెల్ఫీ వీడియో తీయడం ద్వారా, ఈ ఘటనకు నాని కారణమని తొలుత పోలీసులు భావించారు. పోలీసులు నానినీ అదుపులోనికి తీసుకుని విచారించారు. ఉదయం నుంచి స్టేట్మెంట్, సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలన తర్వాత పోలీస్‌లు నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంలో లోకల్ బాయ్ నాని బోటు కూడా లేదని పోలీసులు ప్రాథమిక నిర్ధారణ తర్వాత తెలిపారు.
Updated Date - 2023-11-20T20:43:20+05:30 IST