ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka Case: కస్టడీ విచారణ ఆడియో, వీడియో రికార్డ్ చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

ABN, First Publish Date - 2023-04-20T12:20:52+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాల్సిందే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి (YS bhaskar Reddy), ఉదయ్ కుమార్ రెడ్డి (Udaykumar Reddy) కస్టడీ విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాల్సిందే అని తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt)ఆదేశించింది. కస్టడీలో సీబీఐ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్‌‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. కస్టడీ విచారణలో సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది. అలాగే న్యాయవాదిని రెండు గంటల వరకు అనుమతించాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులు ధర్మాసనం సవరించింది. సాయంత్రం 5గంటల వరకు అంటే విచారణ పూర్తయ్యే వరకు న్యాయవాదిని అనుమతించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలని తెలిపింది. అయితే ప్రశ్నలు లిఖిత పూర్వకంగా అడిగేలా సీబీఐని ఆదేశించాలని భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కోర్టును కోరగా.. దర్యాప్తు ఎలా చేయాలో సీబీఐకి చెప్పలేమన్న హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2023-04-20T12:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising