ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan: 10 స్థానాలు కూడా రాకుంటే.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ABN, First Publish Date - 2023-05-12T16:53:14+05:30

కచ్చితంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ధీమా వ్యక్తం చేశారు. జనసేన (Janasena)లో నేనూ ఒక కార్యకర్తను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కచ్చితంగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ధీమా వ్యక్తం చేశారు. ‘‘జనసేన (Janasena)లో నేనూ ఒక కార్యకర్తను. నేను మార్పును కోరుకునేవాడిని. డబ్బు లేకుండా రాజకీయాలు చేయవచ్చని చూపించాం. ఓట్లు కొనకుండా రాజకీయం చేయాలి. అసలు డబ్బు ఖర్చు పెట్టకుండా రాజకీయాలు కుదరదు. మాకు జనాదరణ ఉంది. జనాదరణ ఉన్నా 10 స్థానాలు కూడా రాకుంటే ఏం చేయలేం. కష్టాల్లో పవన్ గుర్తుకొస్తాడు.. ఎన్నికలప్పుడు మర్చిపోతారు. జనసేన ఉన్నది టీడీపీ (TDP) నేతను సీఎం చేయడానికి కాదు. ఎంఐఎం (MIM) పార్టీ 7 స్థానాలకే పరిమితమైనా దాని ప్రాధాన్యత అలాగే ఉంది. మన బలం ఏమిటో మనం బేరీజు వేసుకోవాలి. క్రేన్లతో గజమాలలు వేయడం కాదు.. ఓట్లు వేయండి. పొత్తులను తక్కువగా అంచనా వేయవద్దు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.

కచ్చితంగా పొత్తులు ఉంటాయి

తాను నటించిన బీమ్లానాయక్ సినిమాను అడ్డుకున్నారని సినిమాను అడ్డుకోవడంతో రూ.30 కోట్లు నష్టం వచ్చిందని పవన్ తెలిపారు. తప్పు చేస్తే కచ్చితంగా నిలదీస్తాం, తాటతీస్తామని హెచ్చరించారు. గుండె దమ్ము లేనివారు రాజకీయాల్లో ఉండకూడదన్నారు. 40 ఏళ్లు పార్టీ నడిపిన, సీఎంగా చేసిన వ్యక్తి గురించే నీచంగా మాట్లాడారని విమర్శించారు. త్రిముఖ పోటీలో బలి కావడానికి జనసేన సిద్ధంగా లేదన్నారు. ఏపీలో కచ్చితంగా పొత్తులు ఉంటాయని, సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జూన్‌ నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధంగా ఉన్నామని పవన్ ప్రకటించారు.

Updated Date - 2023-05-12T17:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising