Boragam Srinivasulu: తారకరత్నను కోల్పోవడం పార్టీకి తీరని లోటు
ABN, First Publish Date - 2023-02-20T18:21:45+05:30
నందమూరి తారకరత్న చిన్నవయసులో మరణించటం చాలా బాధాకరమని, సినీరంగంలో
ఏలూరు: బుట్టాయగూడెంలోని నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో నందమూరి తారకరత్న (Tarakaratna) చిత్రపటానికి పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) నివాలులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి తారకరత్న చిన్నవయసులో మరణించటం చాలా బాధాకరమని, సినీరంగంలో మరియు రాజకీయాల్లో ఎంతో భవిష్యత్ ఉన్న తారకరత్న గారిని కోల్పోవడం పార్టీకి, నందమూరి అభిమానులకు తీరనిలోటనీ తెలిపారు. యువగళం పాదయాత్రలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురవటం.. కుప్పం (Kuppam)లో చికిత్స అనంతరం బెంగుళూరు (Bangalore)లో నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్చడం అమెరికా (America) వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరగడంతో కోలుకుని తిరిగి వచ్చి మరల ప్రజాసేవలో నిమగ్న మవుతారనీ భావించామన్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల ఎంతో మక్కువతో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసేవారని గుర్తుచేశారు. కానీ 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి అస్తమయం చెందటం మాటలలో చెప్పలేనంత బాధగా ఉందని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుండుబోయిన మురళీకృష్ణ, ఏలూరు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యంట్రప్రగడ శ్రీనివాసరావు, ఏలూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి జారం చాందినీ విద్యాసాగరిక, ఏలూరు పార్లమెంట్ తెలుగురైతు కార్యదర్శి గద్దె అబ్బులు, కరగారా. రాము,ఎస్టీ సెల్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు తెల్లం వెంకటేశ్వరరావు, పసుమర్తి భీమేశ్వరరావు, సుంకర వెంకట్రావు, చోడెం. రాంచంద్రరావు గార్లు తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-02-20T18:21:51+05:30 IST