Boragam Srinivasulu: గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించిన పోలవరం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు
ABN, First Publish Date - 2023-05-29T20:15:22+05:30
ఆదివారం మహానాడు బహిరంగ సభా ప్రాంగణంలో గాలితో కూడిన దుమ్ము రావడంతో లైట్ ఇద్దరు టీడీపీ (TDP) కార్యకర్తలపై పడడంతో వారికి గాయాలయ్యాయి.
ఏలూరు జిల్లా: ఆదివారం మహానాడు బహిరంగ సభా ప్రాంగణంలో గాలితో కూడిన దుమ్ము రావడంతో లైట్ ఇద్దరు టీడీపీ (TDP) కార్యకర్తలపై పడడంతో వారికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలవరం (Polavaram) నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. మహానాడు బహిరంగ సభా ప్రాంగణంలో జరిగిన స్వల్ప ఘటనలో పోలవరం మండలం పట్టిసీమ గ్రామానికి చెందిన నేరేడుమిల్లి విజయ్, దగ్గుపాటి రాజు గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి ఆర్థిక సహాయం అందించారు.
నేడు మరల వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. బాధితులకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బాధితులకు సహాయ సహకారాలు అందించాలని స్థానిక నాయకులకు బొరగం శ్రీనివాసులు సూచించారు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు బొడ్డు కృష్ణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పాపోలు గణప రత్తయ్య, ప్రధాన కార్యదర్శి నునకాని రాంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు పతివాడ శ్రీను, ఉలవల శ్రీను, రంప నరసింహామూర్తి, వీరన్న, మైగాపుల మాధవ్, చింతా సత్యనారయణ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-05-29T20:15:52+05:30 IST