Boragam Srinivasulu: దశాదిశ లేని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి
ABN, First Publish Date - 2023-04-01T21:13:36+05:30
వైసీపీ ప్రభుత్వం (YCP Govt) రాష్ట్ర అభివృద్ధిలో వెనక్కి, నిరుద్యోగంలో ముందుకు వెళ్తుందని పోలవరం నియోజకవర్గం (Polavaram Constituency) టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు జిల్లా: వైసీపీ ప్రభుత్వం (YCP Govt) రాష్ట్ర అభివృద్ధిలో వెనక్కి, నిరుద్యోగంలో ముందుకు వెళ్తుందని పోలవరం నియోజకవర్గం (Polavaram Constituency) టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో 98 శాతం హామీలు నెరవేర్చామని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసింది శూన్యమన్నారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాట ఇచ్చి, మాట తప్పారని ఆయన విమర్శించారు. పబ్లిక్ సెక్టార్, విద్యావ్యవస్థలో నియామకాలు చేపట్టలేదన్నారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించి ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల ఉద్యోగాలు భర్తీ అయి ఉండేవన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు లేవని, ప్రభుత్వం నుంచి భారీ ప్రాజెక్టులు లేవని బొరగం శ్రీనివాసులు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సహించి, నెలకొల్పున కియా, హెచ్‌ఎస్బీసీ, హీరో, జాకీ లాంటి మరెన్నో కంపెనీలు రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లవలసి పరిస్థితి ఏర్పడిందన్నారు. బడ్జెట్‌లోనూ నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవని, దశాదిశ లేని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ రైతు కమిటీ అధ్యక్షులు కుంచె దొరబాబు, టౌన్ పార్టీ అధ్యక్షులు పోతుల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు సౌమరౌతు వెంకటేశ్వరరావు, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మంగిన వెంకటరమణ, కస్టర్ కమిటీ ఇంచార్జీ ఆకుల రాజా, ప్రళయమూర్తి, సీనియర్ నాయకులు జల్లేపల్లి నరసింహారావు, ఎస్సీ సెల్ పిల్లి నాగరాజు, చెల్లూరి మణికంఠ, ఐటీడీపీ ఏలూరు పార్లమెంటు అధికార ప్రతినిధి జల్లేపల్లి శేష వెంకట జితేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-01T21:14:27+05:30 IST