Delhi: ఏపీ జలవనరుల శాఖపై కేంద్రం మండిపాటు
ABN, First Publish Date - 2023-12-06T10:20:19+05:30
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికైనా నిజాలు చెబుతున్నారా..? తెలంగాణలో కాళేశ్వరంను ఎలా చేశారో... ఆంధ్రాలో పోలవరాన్ని అలానే చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై కేంద్రం మండిపడింది.
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికైనా నిజాలు చెబుతున్నారా..? తెలంగాణలో కాళేశ్వరంను ఎలా చేశారో... ఆంధ్రాలో పోలవరాన్ని అలానే చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై కేంద్రం మండిపడింది. పోలవరంపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్ర అధికారులపై కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు మండిపడ్డారు. ఈ విధంగా వ్యవహరిస్తే పోలవరం ఈ దశాబ్దంలో పూర్తి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గత మూడేళ్లుగా కాఫర్ డామ్ సీపేజ్ గురించి చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదని కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపర్ డామ్ కుంగిపోతే కొత్తది నిర్మించేందుకు కనీసం అయిదేళ్ళు పడుతుందని తెలుసా? అని రాష్ట్ర అధికారులను ప్రశ్నించారు. సీపేజ్ ఒకవైపు వుంటే మరో వైపు నీరు ఎందుకు నిల్వ చేస్తున్నారని నిలదీశారు. కాపర్ డామ్ మరమ్మత్తులకు... పంపింగ్‌కు నిధులు ఇవ్వదని కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పదిరోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో ఎంవోయూ (MOU) చేసుకోవాలని రాష్ట్ర అధికారులకు ఆదేశించారు. తాము ప్రాజెక్ట్ అథారిటీ లోపాలపై రాసిన లేఖలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని కేంద్రం నిలదీసింది.
Updated Date - 2023-12-06T10:20:21+05:30 IST