ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Polavaram: పోలవరంపై కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం

ABN, First Publish Date - 2023-07-24T15:54:02+05:30

ఢిల్లీ: పోలవరంపై కేంద్రం తేల్చేసింది. పార్లమెంటు సాక్షిగా కీలక వివరాలు వెల్లడించింది. దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంటూ తేల్చి చెప్పింది.

ఢిల్లీ: పోలవరంపై కేంద్రం తేల్చేసింది. పార్లమెంటు (Parliament) సాక్షిగా కీలక వివరాలు వెల్లడించింది. దశల వారీగానే పోలవరం ప్రాజెక్టు (Polavaram project) నిర్మాణం అంటూ తేల్చి చెప్పింది. సోమవారం రాజ్యసభ (Rajya Sabha)లో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) అడిగిన ప్రశ్నకు కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పట్లో పూర్తి కానట్లేనని కేంద్రం సమాధానంతో స్పష్టమవుతోంది. 41.15 మీటర్ల వరకు నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం చేపట్టాలనుకున్న జగన్ (Jagan).. మొదటి దశలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ. 17,144.06 కోట్లు అవసరమని ఏపీ ప్రభుత్వం (AP Govt.) ప్రతిపాదించింది.

మొదటి దశలో మిగిలిన పని పూర్తయ్యేందుకు అయ్యే అదనపు ఖర్చును భరించేందుకు కేంద్రం అభ్యంతరం తెలపలేదు. రూ. 10,911.15 కోట్లు చెల్లించేందుకు.. మరో రూ. 2వేల కోట్లు వరదలు కారణంగా జరిగిన నష్టం కింద చెల్లించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. అయితే సదరు ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోదించాల్సివుంది. ఇప్పటి వరకు వున్న కాలక్రమం ప్రకారం 2024 జూన్ వరకు ప్రాజెక్టు నిర్మాణం గడువు ఉంది. కానీ 2020- 2022 సంవత్సరాల్లో గోదావరికి వచ్చిన వరదలు కారంణంగా ఆలస్యమైంది.

Updated Date - 2023-07-24T15:54:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising