Chandrababu: నాలుగున్నర ఏళ్ల నుంచి వ్యవస్థలను నాశనం చేస్తున్న వైసీపీ
ABN, First Publish Date - 2023-08-18T14:10:56+05:30
కోనసీమ జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం అమలాపురంలో పర్యటిస్తున్న ఆయన ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు.
కోనసీమ జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) పర్యటన కోనసీమ జిల్లా (Konaseema District)లో కొనసాగుతోంది. శుక్రవారం అమలాపురంలో పర్యటిస్తున్న ఆయన ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైద్య విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, యువతే తన సైన్యమన్నారు. ఇన్సూరెన్స్ (Insurance) చేయించి ప్రతీ ఒక్కరికీ లక్ష రూపాయలు వరకు వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. డాక్టర్లు, ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు మంచిని ప్రోత్సాహించాలని, రాజకీయాల్లో విలువలు లేవని, వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థలను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ హయాంలో పోలీస్ వ్యవస్థ చట్టానికి లోబడి పనిచేసిందని, ఇప్పుడు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తోందని చంద్రబాబు విమర్శించారు. అమెరికాలో ఉన్నవారిపైనా అక్రమ కేసులు పెట్టారని, వైద్యులకు, న్యాయవాదులకే కాదు ప్రజలకే రక్షణ లేదన్నారు. టీడీపీ హయాంలో ఆక్వా రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని, మళ్ళీ ఆక్వా రంగానికి పూర్వవైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. మహాశక్తి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత తొలిసారిగా అమలాపురంలో మహిళా ప్రగతి కోసం ప్రజావేదిక నిర్వహించటం అదృష్టంగా బావిస్తున్నానన్నారు. సమాజంలో 50 శాతం మహిళలు ఉన్నారని, టీడీపీ హయాంలో డ్వాక్రా సంఘాలు, మహిళా రిజర్వేషన్లు తీసుకువచ్చామన్నారు. 1996లో కోనసీమలో సైక్లోన్ వచ్చిందని, అప్పుడు ప్రజలకు అండగా ఉన్నామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలు వర్క్ ప్రం హోమ్ చేసుకునేలా చర్యలు చేపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Updated Date - 2023-08-18T14:10:56+05:30 IST