Cyclone Michaung: ఏలూరులో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. భారీ వర్షాలు.. ఆందోళనలో రైతులు
ABN, First Publish Date - 2023-12-05T11:10:46+05:30
Andhrapradesh: జిల్లాలో మిచౌండ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్‌గా ఏర్పడింది.
ఏలూరు: జిల్లాలో మిచౌండ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్‌గా ఏర్పడింది. దీని ప్రభావంతో ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గత రెండు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో రొయ్యలు సాగు, ఆక్వా రైతంగాల్లో తీవ్రంగా నష్టంపోయే ప్రమాదం వాటిల్లింది. నియోజకవర్గంలో పలు చోట్ల వరి పంట నేలకొరిగింది. అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చేపలు, రొయ్యల దెబ్బతినే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు పట్టణంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కైకలూరు నియోజకవర్గంలో రోడ్లు గుంతలమయంతో అధ్వానంగా ఉండటంతో వర్షం నీటితో మునిగిన గుంతలు కాన రాక ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Updated Date - 2023-12-05T11:10:49+05:30 IST