Pawan Kalyan: గోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్కటి కూడా గెలవకూడదు
ABN, First Publish Date - 2023-06-30T16:32:57+05:30
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన జెండా ఎగరాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్నారు. ఆయన కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు. కాకినాడలో నేరస్థులను ఎదుర్కోవాలంటే చట్టం తెలిసిన బలమైన నాయకుడు కావాలని ఆకాంక్షించారు
భీమవరం: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన జెండా ఎగరాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటిస్తున్నారు. ఆయన కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు. కాకినాడలో నేరస్థులను ఎదుర్కోవాలంటే చట్టం తెలిసిన బలమైన నాయకుడు కావాలని ఆకాంక్షించారు. ఇక గోదావరి జిల్లాల్లో వైసీపీకి (YCP) ఒక్క సీటు కూడా రాకూడదన్నారు. ఇది కష్టమేనని తెలుసు.. అయినా కూడా లక్ష్య సాధన దిశగా అందరూ పనిచేయాలని కోరారు. తాను అమ్ముడుపోవాలనుకుంటే అది చాలా తేలికైన పని అని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా ఏ పదవో.. ఏ మంత్రి పదవో అడిగితే సరిపోతుందన్నారు. కానీ తాను ఆలోచించేది కార్యకర్తల కోసమేనని స్పష్టం చేశారు. తనకు నిరాశ నిస్పృహలు ఉంటాయి.. కానీ కొంతమంది నాయకుల రాక వలన కొత్త ఉత్సాహం వస్తుందని పవన్‌కల్యాణ్ చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-06-30T16:32:57+05:30 IST