ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ambati Rambabu: పోలవరం పనులను పరిశీలించిన మంత్రి అంబటి

ABN, First Publish Date - 2023-07-19T13:01:52+05:30

పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు.

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ... లోయర్ అప్పర్ కాఫర్ డ్యాంలు రెండు పూర్తి అయిన తర్వాత వస్తున్న మొదటి వరద అని చెప్పుకొచ్చారు. గత ఏడాది లోయర్ కాఫర్ డ్యాం పూర్తికాక పోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. ప్రస్తుతం 1లక్షా 20వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోందన్నారు. గత ప్రభుత్వాలు ప్రోటో కాల్ లేకుండా పనులు చేపట్టారన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోయర్, అప్పర్ కాఫర్ డ్యాంలను పూర్తి చేశామని చెప్పారు. లోయర్, అప్పర్ కాఫర్ డ్యాంలు మూడేళ్ల కంటే ఎక్కువ పని చేయవన్నారు. వాటి గ్యారంటీ అయిపోయిందని.. గత ప్రభుత్వాలు ఎంతటి తప్పిదాలు చేశాయి అనేది పదేపదే చెప్తున్నామని తెలిపారు. నదిని డైవర్ట్ చేసే పని చేయకుండా లోయర్, అప్పర్ కాఫర్ డ్యాం పనులు చేపట్టారన్నారు. పోలవరం విషయంలో గత ముఖ్యమంత్రి, అప్పటి మంత్రి పెద్ద క్రైం చేశారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

Updated Date - 2023-07-19T13:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising