ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nuzvid IIIT: విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారుల షాక్

ABN, First Publish Date - 2023-05-05T10:27:27+05:30

విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాకిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ (Nuzvid IIIT) అధికారులు షాకిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు క్యాంపస్‌లలో ఆఖరి ఏడాది పూర్తి చేసుకున్న నాలుగు వేల మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించని కారణంగా ఆర్జీయూకేటీ ధ్రువపత్రాలను నిలిపివేసింది. దీంతో పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తాన్ని గడువు మేరకు ఎప్పటికప్పుడు తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని సీఎం జగన్ చెబుతున్న గొప్పల్లో డొల్లతనం బయటపడినట్లైంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఆఖరి సంవత్సర విద్యార్థులు పూర్తి బకాయిలను ఈరోజు సాయంత్రంలోగా చెల్లించకపోతే బయటకు అనుమతి లేదని, అల్పాహారం, వసతి కట్ చేయాలని, ధ్రువపత్రాలు ఇవ్వవద్దంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఇంటర్నషిప్‌తో ప్లేస్‌మెంట్ సాధించిన విద్యార్థులు ఆయా కంపెనీల్లో హాజరుకాల్సి ఉండగా.. అధికారుల ఉత్తర్వులతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. చదువు పూర్తయినప్పటికీ విద్యాదీవెన అందకపోవడంతో విద్యార్థులకు కళాశాలల యాజమాన్యం ధ్రువపత్రాలు నిలిపివేయడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

బీటెక్ నాలుగో ఏడాది విద్యార్థులకు విద్యా సంవత్సరం ముగిసిపోయినా ప్రభుత్వం ఒక్క త్రైమాసికం ఫీజునే చెల్లించగా.. మూడు విడతల ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫీజులు తల్లుల ఖాతాల్లో జమ అవుతున్నందున తమకు సంభందం లేదని, కట్టాల్సిందేనని విద్యార్థులపై ట్రిపుల్ ఐటీ అధికారులు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. ఉన్నత విద్యా మండలి ఇచ్చిన ఉమ్మడి అకాడమీక్ కేలండర్ ప్రకారం ఏప్రిల్ 24తో నాలుగో ఏడాది వారికి విద్యా సంవత్సరం ముగిసింది. కానీ ప్రభుత్వం మాత్రం ఫీజులు చెల్లించకపోగా... అక్టోబర్ నెలను ప్రామాణికంగా తీసుకుని వింత లెక్కలు వేస్తున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రైవేటు కళాశాలల్లో బీటెక్ చివరి ఏడాది విద్యార్థులు కళాశాల విడిచి ఇప్పటికే వెళ్లిపోయారు. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు వచ్చిన వారికి ధ్రువపత్రాలు అవసరం ఉంటుంది. అయితే ప్రభుత్వం ఫీజులను చెల్లించని పక్షంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా ధ్రువ పత్రాలు తప్పనిసరి. ప్రభుత్వం ఒక్కో త్రైమాసికానికి రూ.699 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం సకాలంలో విద్యా, వసతి దీవెన అందించకపోవడంతో విద్యార్థుల నుంచి కళాశాలల యాజమాన్యాలు అదనంగా వసూళ్ళు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక్కో విద్యార్థి సుమారుగా 1లక్షకు పైగా ఫీజు బకాయి ఉండగా... 4000 మంది విద్యార్థులు నుంచి కోట్లలో ఫీజు బకాయిలు రావాల్సి ఉంది. అయితే గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులపై లక్షల్లో ఫీజుల భారం పడటంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

Updated Date - 2023-05-05T10:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising