ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Leader: ఏపీకి చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం ఎంతో ఉంది

ABN, First Publish Date - 2023-01-24T10:59:00+05:30

ఏలూరు జిల్లా ద్వారాకతిరుమల మండలం జి కొత్తపల్లిలో ఇదేంకర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని గోపాలపురం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఏలూరు జిల్లా ద్వారాకతిరుమల మండలం జి కొత్తపల్లిలో ఇదేంకర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని గోపాలపురం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు (TDP Leader Maddipati Venkatraju) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అధిక ధరలు, పెరిగిన విద్యుత్ చార్జీలు, రాష్ట్రంలో గాడి తప్పిన అభివృద్ధి లాంటి అంశాలపై ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కష్టాలు తీరాలంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతో ఉందని వెంకటరాజు అభిప్రాయపడ్డారు.

అనంతరం యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 27న యువగళం పాదయాత్ర మొదలు పెడుతుంటే వైసీపీ ప్రభుత్వం ఈ పాదయాత్రని అడ్డుకోవడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఏ పర్మిషన్ తీసుకున్నారో చూపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్లి మమేకం అవ్వచ్చు అన్నారు. ఈ హక్కుని ఆపటం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపు, చంద్రబాబు నాయకత్వం వైపుచూస్తున్నారని తెలిపారు. అధికారంలోకి రానున్నది తెలుగుదేశం పార్టీ నే అని మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T10:59:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising