ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP leaders: నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2023-01-21T20:11:47+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభించబోతున్న 'యువగళం' పాదయాత్ర...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, (ఏలూరు జిల్లా): టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభించబోతున్న 'యువగళం' పాదయాత్ర ('Yuvagalam' Padayatra) విజయవంతం కావాలని కోరుతూ యువనేతలు బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు (Ramalingeswara Rao), పారేపల్లి నరేష్ (Parepalli Naresh) ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం గోకులపారిజాతాగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువత బంగారు భవిత కోసం, రైతుల కోసం, మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రగతికోసం లోకేష్ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజులు, 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేపడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శేషు తెలిపారు. పాదయాత్ర సజావుగా సాగాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించామని, దగా పడ్డ ఆంధ్రుడి ఆత్మఘోషకు ప్రతీక ఈ పాదయాత్ర అని దాసరి శేషు అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నేత నంబురి రామచంద్రరాజు, ఆకుమర్తి రామారావు, కుక్కల మాధవరావు, కొండ్రెడ్డి కిషోర్, చెరుకూరి శ్రీధర్, మాణికల నాగేశ్వరరావు, బూసా సత్యనారాయణ, ఘంటా రామారావు, పగడం సౌభాగ్యవతి, చిల్లపురెడ్డి ఇంద్రాణి, రాఘవరావు, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, గుల్లపూడి శ్రీదేవి, ఈర్ని సూరిబాబు, కోటగిరి ప్రమీల, కన్నా శ్రీదేవి, కోనేటి చంటి, యడ్లపల్లి ఏడుకొండలు, లింగాల సత్యనారాయణ, లాగు సురేష్, కొంచాడ ప్రసాద్, చిత్తపురి దుర్గేష్, పేంట్ సాహెబ్, కొండ్రు నాగరాజు, మల్లిపూడి నవీన్, రాగాని శ్రీను, తాళ్లూరి వెంకటేశ్వరరావు, పులపాకుల విజయ్, మన్యం దుర్గారావు, దిద్దే దుర్గారావు, పాకనాటి సురేష్, విష్ణు, ఎన్టీఆర్, కాగితాల రాంబాబు, ఉదయ్, దారా మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-21T20:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising