ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP MLA Tellam Balaraju: బాలుడికి పోలవరం ఎమ్మెల్యే సాయం

ABN, First Publish Date - 2023-05-03T22:36:22+05:30

: అనారోగ్యంతో బాధపడుతున్న హర్షవర్ధన్ (6) అనే గిరిజన బాలుడికి వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (YCP MLA Tellam Balaraju) సాయం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు జిల్లా: అనారోగ్యంతో బాధపడుతున్న హర్షవర్ధన్ (6) అనే గిరిజన బాలుడికి వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (YCP MLA Tellam Balaraju) సాయం చేశారు. పోలవరం నియోజకవర్గం (Polavaram Constituency) బుట్టాయిగూడెం మండలం బెడదనూరుకు చెందిన పాయం దుర్గారావు కుమారుడు హర్ష వర్ధన్ గుండెలో రంధ్రం ఏర్పడడంపై ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. బాలుడి అనారోగ్యంపై స్పందించిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సాయి ఆస్పత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్స చేయించారు. బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.

తాను కోరిన వెంటనే బాలుడికి చికిత్స అందించిన సాయి ఆస్పత్రి యాజమాన్యానికి, ఎండీ, డాక్టర్ విజయ కుమార్, గుండె వైద్య నిపుణులు డాక్టర్ శరత్ చంద్రకు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు.

తమ బాలుడి పట్ల శ్రద్ధ వహించి నిరంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందెలా చేసి తమ బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు బాలుడి తల్లిదండ్రులు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఆస్పత్రి యాజమాన్యానికి, డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-05-03T22:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising