ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆపై బెదరింపులు.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-07-06T15:45:29+05:30

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై అసభ్య వీడియోలుతో యువతిని యువకుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై అసభ్య వీడియోలుతో యువతిని యువకుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ముదినేపల్లి మండలానికి చెందిన యువతి హైదరాబాదులోని ఓ కళాశాలలో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా బిట్రపాడుకు చెందిన నవీన్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచమయ్యాడు. స్నేహితుడిగా భావించి యువకుడితో యువతి పరిచయం పెంచుకుంది. కొంతకాలానికి ప్రేమిస్తున్నానంటూ సదరు యువకుడు సందేశాలు పంపించాడు. యువతితో చనువు పెంచుకొని వీడియో కాల్ చేసి అసభ్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియోలను బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి యువతి నుంచి రూ.25000 వసూలు చేశాడు. ఇటీవల మరలా బెదిరిస్తూ మరో లక్ష కావాలని వేధిస్తుండడంతో యువతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో మంగళవారం రాత్రి ఇంటి వద్దకు వస్తే నగదు ఇస్తామని తెలపడంతో సదరు వ్యక్తి వచ్చాడు. ఆ సమయంలో వ్యక్తిని పట్టుకునేందుకు తల్లిదండ్రులు, బంధువులు ప్రయత్నించగా పరారయ్యాడు. వెంటనే యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై షణ్ముఖ సాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి యువకుడును అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-07-06T15:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising