Yanamala : చంద్రబాబును డాక్టర్లు చెక్ చేసినట్టు ఎక్కడా లేదు.. అసలు రిపోర్ట్ ఎక్కడ?
ABN, First Publish Date - 2023-10-13T11:40:04+05:30
జైలు శాఖ ఇన్ చార్జ్ పర్యవేక్షణాధికారి రాజ్ కుమార్ విడుదల చేసిన హెల్త్ బులిటన్‌లో సరైన వివరాలు లేవని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. డాక్టర్లు చెక్ చేసినట్టు హెల్త్ బులిటెన్‌లో ఎక్కడా లేదన్నారు.
రాజమండ్రి : జైలు శాఖ ఇన్ చార్జ్ పర్యవేక్షణాధికారి రాజ్ కుమార్ విడుదల చేసిన హెల్త్ బులిటన్‌లో సరైన వివరాలు లేవని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. డాక్టర్లు చెక్ చేసినట్టు హెల్త్ బులిటెన్‌లో ఎక్కడా లేదన్నారు. అసలు చెక్ చేసిన రిపోర్టు ఎక్కడ ఉందని యనమల ప్రశ్నించారు. డాక్టర్లు ఇచ్చిన నివేదిక బయటపెట్టలేదన్నారు. చంద్రబాబుకి బోరు వాటర్ సప్లై చేస్తున్నారన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు.. నెల రోజుల్లో ఐదు కేజీల బరువు తగ్గారని యనమల పేర్కొన్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. చంద్రబాబు హెల్త్ రిస్క్‌లో ఉందన్నారు. ఆయనకి జైలులో ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని యనమల డిమాండ్ చేశారు.
Updated Date - 2023-10-13T11:40:04+05:30 IST