Minister Botsa: వలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తోంది.. పవన్ కల్యాణ్ ఎవర్ని బెదిరిస్తున్నారు..?
ABN, First Publish Date - 2023-07-20T21:00:27+05:30
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ఆగ్రహం వ్యక్తం చేశారు.
"పవన్ వలంటీర్ల వ్యవస్థను కించపరిచారు. కించపరిచే విధంగా మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వలంటీర్లుగా కుటుంబ సభ్యులనో.. పక్కింటి వాళ్లనో నియమించాం. వలంటీర్లు ఎందుకు మహిళలను కిడ్నాప్ చేస్తారు. వలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వ వ్యవస్థల వల్ల ఇబ్బందులు వస్తే.. ప్రభుత్వానిదే బాధ్యత. సీఐ ఏదో చేయి చేసుకుందని కంప్లైంట్ చేయలేదా..?. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఏదైనా చేస్తే దానికి ప్రభుత్వానిదే బాధ్యత. ఏపీ ప్రజలు బందిపోటు దొంగలా..? దోపిడీదారులా..?. డేటా సేకరించడం అనేది ఇప్పుడే చేయడంలేదు. గత ప్రభుత్వాలూ డేటాను సేకరించాయి. గత ప్రభుత్వంలో జరిగింది డేటా చోరీ.. ఆ ప్రభుత్వం ప్రజల డేటాను ఎన్నికల కోసం వాడుకున్నారు." అని బొత్స విమర్శించారు.
"మేం ప్రజల క్షేమం కోసం డేటాను రాజ్యాంగ బద్ధంగా సేకరిస్తున్నాం. సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామని.. వలంటీర్ల వ్యవస్ధను రద్దు చేస్తామని చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వంతో పవన్ సంబంధం పెట్టుకోమనండి. పవన్ కేంద్రంతో కాకుంటే అమెరికా గత ప్రెసిడెంట్ ఒబామాతో పెట్టుకోవచ్చు.. లేదా ప్రస్తుత ప్రెసిడెంట్ జో- బైడెన్‌తో సంబంధం పెట్టుకోవచ్చు. కేంద్రంతో పరిచయాలున్నాయంటూ పవన్ ఎవర్ని బెదిరిస్తున్నారు..?. ఇంతకు మించి పవన్ గురించి మాట్లాడేదేం లేదు. వేరే ఏమైనా అడగండి చెపుతాను." అని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
Updated Date - 2023-07-20T21:07:07+05:30 IST