YCP: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు తెరతీసిన వైసీపీ
ABN, First Publish Date - 2023-03-10T20:50:25+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) వైసీపీ (YCP) ప్రలోభాలకు తెరతీసింది
విశాఖపట్నం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) వైసీపీ (YCP) ప్రలోభాలకు తెరతీసింది. ఓటర్లకు పంచడానికి వైసీపీ శ్రేణులు గిప్ట్ ప్యాక్‌లు సిద్ధం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఆఫీస్ నుంచే ఓటర్లకు గిఫ్ట్‌లు వెళ్తున్నాయని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి.
మరోవైపు అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అనంతపురం, కడప, నెల్లూరు (Anantapur Kadapa Nellore), చిత్తూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మరో 4.. పశ్చిమగోదావరిలో రెండు స్థానాలు, శ్రీకాకు ళం, కర్నూలు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు పోటీగా అభ్యర్థులు బరిలో నిలవడంతో ఈ స్థానాలకు మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో పి.రామసుబ్బారెడ్డి(వైసీపీ) ఏక గ్రీవం అయ్యారు. అలాగే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటాలో కుడుపూడి సూర్యనారాయణ(వైసీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections)కు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా కమిషన్ పేర్కొంది. మార్చి 23వ తేదీన పోలింగ్, అదే రోజు కౌంటింగ్ కూడా జరగనుంది. మార్చి 25వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. నారా లోకేశ్, చల్లా భగీరథరెడ్డి (Nara Lokesh Challa Bhagirath Reddy), పోతుల సునీత, బచ్చుల అర్జు నుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెనుమత్స సూర్యనారాయణరాజు, గంగుల ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలం మార్చి 29న ముగియనుంది. దీంతో ఆ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.
Updated Date - 2023-03-10T20:51:15+05:30 IST