ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ganta: ప్రచార ఆర్భాటాల కోసం ప్రజా ధనాన్ని నాశనం చేస్తున్నారంటూ సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు ఫైర్

ABN, First Publish Date - 2023-08-27T16:51:02+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.

విశాఖపట్నం: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు.


"జగనన్న బస్ బేలపై ట్విట్టర్ వేదికగా గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కట్టడం అయ్యింది... కూలడం కూడా అయ్యింది జగన్మోహన్ రెడ్డి. ఒక చిన్న బస్ షెల్టర్ నే సక్రమంగా కట్టలేని వాళ్ళు, రాజధాని, పోలవరం కట్టేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. ఇక ప్రజలు బై జగన్.. బై బై జగన్ అని చెప్పాల్సిన సమయం వచ్చేసింది. విశాఖ నగరంలో దాదాపు రూ.40 లక్షలు వ్యయంతో మీరు నిర్మించిన మోడల్‌ బస్‌షెల్టర్ నాలుగు రోజులకే కుప్పకూలింది. ప్రచారాలకు తప్ప అభివృద్ధికి, నిర్మాణాలకు పనికిరాని ప్రభుత్వమని మరోసారి నిరూపితం అయ్యింది. రాష్ట్రంలో బస్సులు తిరగడానికి సరైన రోడ్డులు లేవు కానీ, మీ ప్రచార ఆర్భాటాల కోసం ఇలా ప్రజా ధనాన్ని నాశనం చేస్తున్నారు. ఒక చిన్న బస్ షెల్టర్ నే సక్రమంగా కట్టలేని వాళ్ళు, రాజధాని, పోలవరం కట్టేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. తుమ్మితే వూడే ముక్కు చందంగా మారిన బస్‌షెల్టర్లు కోసం ఆరోజు గ్రీన్‌బెల్ట్‌లోని దశాబ్దాల వయస్సు కలిగిన భారీ వృక్షాలను విచక్షణారహితంగా నరికేసుకుంటూ పోయారు. నగరంలో కొన్నిచోట్ల ఏడాది కిందటే లక్షలాది రూపాయలు వెచ్చించి బస్‌ షెల్టర్‌లను నిర్మించారు. దృఢంగా ఉన్న ఆ బస్ షెల్టర్లను కూడా పూర్తిగా తొలగించి ఇలాంటి నాసిరకం బస్‌షెల్టర్లు నిర్మించి ప్రజా ధనాన్ని వృధా చేస్తూ... ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు. మీ ప్రచారాల ప్రభుత్వం కూడా కూలిపోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి." అని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-27T16:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising