TTD: తిరుమలలో వైసీపీ జెండాతో యువకుల హల్‌చల్
ABN, First Publish Date - 2023-05-21T20:23:10+05:30
తిరుమల (Tirumala)లో వైసీపీ జెండాతో ఓ కారు ఆదివారం హల్‌చల్ చేసింది. తిరుమలకు రాజకీయ జెండాలు, కరపత్రాలు, వ్యక్తుల ఫొటోలు, చిహ్నాలను తీసుకురావడం నిషేధం.
తిరుమల: తిరుమల (Tirumala)లో వైసీపీ జెండాతో ఓ కారు ఆదివారం హల్‌చల్ చేసింది. తిరుమలకు రాజకీయ జెండాలు, కరపత్రాలు, వ్యక్తుల ఫొటోలు, చిహ్నాలను తీసుకురావడం నిషేధం. అలా ఎవరైనా వస్తే వారిని అలిపిరిలోని చెక్‌పాయింట్‌లోనే భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అడ్డుకుంటారు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఓ థార్ వాహనం ముందు వైసీపీ జెండా (YCP flag)తో తిరుమల కొండపై హడావుడి చేసింది. ‘ఫ్యాను గుర్తుకే మీ ఓటు’ అనే నినాదంతో కూడిన వైసీపీ జెండాతో తిరుమల రోడ్లపై తిరుగుతున్నప్పటికీ విజిలెన్స్ అధికారులు గుర్తించకపోవడం గమనార్హం.ఈ అంశంపై భద్రతాధికారులను అడగ్గా నెల్లూరు (Nellore)కు చెందిన సుభాన్‌తో పాటు మరో నలుగురు యువకులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారని, తిరుగు ప్రయాణంలో నిబంధనలు తెలియక వైసీపీ జెండాను వాహనం ముందు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ ఆదివారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.
Updated Date - 2023-05-21T20:23:10+05:30 IST