YS Viveka Case CBI Enquiry: అవినాష్, భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ సీబీఐ విచారణ సాగిందిలా..!
ABN, First Publish Date - 2023-04-19T11:14:48+05:30
వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) విచారణలో భాగంగా సీబీఐ నోటీసులు అందుకున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) సీబీఐ కార్యాలయానికి..
* ముగిసిన అవినాశ్, భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ సీబీఐ విచారణ
* సాయంత్రం 5 గంటలకు చంచల్‌గూడ జైలుకు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి
* భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌లను జైలుకు తరలించనున్న సీబీఐ
* భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం రీత్యా జైలులో చికిత్స అందించనున్న సీబీఐ
* రేపు ఉదయం మళ్లీ కస్టడీలోకి తీసుకోనున్న సీబీఐ అధికారులు
* అవినాశ్‌రెడ్డి ఇచ్చిన సమాచారంతో భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ను ప్రశ్నించిన సీబీఐ
* రూ.40 కోట్ల డీల్ జరిగిందన్న దస్తగిరి ఆరోపణలపై ముగ్గురిని ప్రశ్నించిన సీబీఐ
* వివేకా హత్యకు సంబంధించి నగదు వ్యవహారంపై సీబీఐ ఆరా
* సునీల్‌యాదవ్‌కు రూ.కోటి బదిలీ చేసింది ఎవరని ప్రశ్నించిన సీబీఐ
* డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని సీబీఐ ఆరా
* హత్య జరిగిన ముందురోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి,..
* సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి ఎందుకు మీ ఇంట్లో ఉన్నారు?: సీబీఐ
* నిందితులతో ఉదయ్, భాస్కర్‌రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటని సీబీఐ ఆరా
* సాక్ష్యాల తారుమారు ప్రయత్నంపై భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ను ప్రశ్నించిన సీబీఐ
* హైదరాబాద్: వివేకా కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ
* భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌లను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు
* వివేకా హత్యకు సంబంధించి నగదు వ్యవహారంపై సీబీఐ ఆరా
* సునీల్‌యాదవ్‌కు మీరే రూ.కోటి బదిలీ చేశారా అని ప్రశ్నించిన సీబీఐ
* హత్య జరిగిన ముందురోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి,..
* సునీల్ యాదవ్, ఎర్ర గంగిరెడ్డి ఎందుకు మీ ఇంట్లో ఉన్నారు?: సీబీఐ
* నిందితులతో మీకు ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించిన సీబీఐ
* సాక్ష్యాల తారుమారు ప్రయత్నంపై భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ను ప్రశ్నించిన సీబీఐ
* వివేకా హత్య కేసు నిందితులపై (అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి) సీబీఐ ప్రశ్నల వర్షం:
1. వివేకా గుండెపోటుతో చనిపోయారని ఎందుకు ప్రచారం చేశారు..?
2. సాక్ష్యాలను ఎందుకు తారుమారు చేయాల్సి వచ్చింది..?
3.వివేకా గాయాలు కన్పించకుండా బ్యాండేజ్ ఎందుకు వేశారు?
4. హత్య జరిగిన రోజు ఉదయ్‌కుమార్ రెడ్డి మీ ఇంట్లో ఎందుకున్నారు?
5.సునీల్‌యాదవ్, ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో మీకున్న సంబంధమేంటి..?
6. హత్య రోజు ఇంట్లోనే ఉండి..ఎక్కడో ఉన్నానని ఎందుకు చెప్పారు..?
7. వివేకానందరెడ్డితో మీకు విభేదాలున్నాయా..?
8. రూ.40 కోట్ల డీల్‌పై మీరేమంటారు..ఫండింగ్ చేసిందెవరు..?
9. మీరు చెబితేనే హత్య చేశామని దస్తగిరి చెబుతున్నాడు కదా..?
10. ఇన్నాళ్లూ లేని వివాహేతర సంబంధాల ప్రస్తావన ఇప్పుడెందుకు తీసుకొచ్చారు..?
* వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
* అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి , భాస్కర్ రెడ్డిని కలిపి విచారిస్తున్న సీబీఐ అధికారులు
* నిందితులకు కీలక ప్రశ్నలు సంధిస్తున్న ఇన్వెస్టిగేషన్ టీమ్
* వివేకా హత్య జరిగిన తరువాత అసలు ఏం జరిగింది..?
* హత్య చేసిన నిందితులు భాస్కర్ రెడ్డి ఇంటికి రావడానికి కారణం ఏంటి..?
* హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు ఎందుకు చెరిపారు ? అంటూ.. ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్న సీబీఐ
* గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా ప్రశ్నిస్తున్న అధికారులు
* వివేకా హత్య కేసు విచారణలో తాజా పరిణామాలపై శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
* అబద్ధాలను పదేపదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని బహిరంగ సభలో చెప్పిన జగన్
* కేంద్ర దర్యాప్తు సంస్థను తప్పుబట్టే రీతిలో జగన్ వ్యాఖ్యలు
* వివేకా హత్య కేసులో తన కుటుంబ సభ్యులకు ఉచ్చు బిగుస్తుండటంతో సానుభూతి కలిగించేందుకు సీఎం జగన్ విశ్వ ప్రయత్నం
* కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్న వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాశ్ రెడ్డి
* సీబీఐ కార్యాలయం లోపలికి అవినాష్, భాస్కర్ రెడ్డి వెళుతున్న దృశ్యాలు
* సీబీఐ కస్టడీకి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి
* చంచల్‌గూడ జైలులో కస్టడీకి తీసుకున్న సీబీఐ అధికారులు
* వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన సీబీఐ
* వైద్య పరీక్షల అనంతరం సీబీఐ ఆఫీస్‌కు భాస్కర్‌రెడ్డి, ఉదయ్
* వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ని ప్రశ్నించనున్న సీబీఐ
* ఈ నెల 24 వరకు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కి సీబీఐ కస్టడీ
* సీబీఐ కార్యాలయానికి కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి
* హైదరాబాద్: ఐదోసారి సీబీఐ విచారణకు అవినాశ్‌రెడ్డి
* వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డిని విచారిస్తున్న సీబీఐ
* వివేకా కేసులో అవినాశ్‌ను ఇప్పటికే 4 సార్లు ప్రశ్నించిన సీబీఐ
* ఈ నెల 25 వరకు అవినాశ్‌రెడ్డిని విచారించనున్న సీబీఐ
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) విచారణలో భాగంగా సీబీఐ నోటీసులు అందుకున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని (YS Bhaskar Arrest) సీబీఐ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. వివేకా కేసులో అవినాశ్‌ను సీబీఐ ఇప్పటికే 4 సార్లు ప్రశ్నించింది. ఈ నెల 25 వరకు అవినాశ్‌రెడ్డిని సీబీఐ విచారించనుంది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియోతో సహా సీబీఐ రికార్డ్ చేయనుంది. ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని ఈనెల 25వ తేదీదాకా అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
అవినాశ్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై 25వ తేదీన తీర్పు చెప్పనున్నట్లు ప్రకటించింది. హోరాహోరీ వాదనల అనంతరం మంగళవారం జస్టిస్ సురేందర్ ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. ‘‘25వ తేదీ వరకు ప్రతిరోజూ అవినాశ్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలి. విచారణకు సహకరించాలి. సీబీఐ అధికారులు ప్రశ్నలను లిఖితపూర్వకంగా అందజేయాలి. అవినాశ్ రెడ్డి ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. విచారణకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలి’’ అని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
ఇక.. వివేకా హత్య కేసులో ఏ-6, ఏ-7గా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఈ నెల 24 వరకు ఆరు రోజులపాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లను అనుమతించింది. భాస్కర్‌రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలతో కలిపి ఎంపీ అవినాశ్‌రెడ్డిని విచారిస్తామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
‘‘వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు.. హత్యకు ముందు రోజు సాయంత్రం మీ ఇంట్లో ఎందుకున్నాడు? నిందితులకు మీ ఇంట్లో ఏం పని? హత్య జరిగిన రోజు ఉదయం 6.32 గంటలకు సీఎం సతీమణి భారతికి ఎందుకు కాల్ చేశారు? ఫోన్‌లో ఏం మాట్లాడారు?’’ ఇలా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ అధికారులు ఇప్పటికే గత విచారణలో అనేక ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. తమ దర్యాప్తులో గుర్తించిన వివరాలు, సాంకేతిక ఆధారాలను, ఫోన్ కాల్స్ సమాచారాన్ని ముందుంచుకుని విచారణ జరిపినట్లు సమాచారం. అయితే.. తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్, అరెస్ట్ చేయొద్దంటూ పదేపదే అవినాశ్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో సీబీఐ ఈ కడప ఎంపీపై ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Updated Date - 2023-04-19T17:46:42+05:30 IST