ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Viveka Murder Case: తెలంగాణ హైకోర్టులో అవినాశ్రెడ్డి, సునీత లాయర్ల మధ్య వాగ్వాదం

ABN, First Publish Date - 2023-04-18T17:09:31+05:30

వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa YCP MP Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa YCP MP Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై (Avinash Bail Petition) తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన వివేకా కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy) తరపు వాదనలు కూడా న్యాయస్థానం వినడం గమనార్హం. కోర్టులో అవినాశ్రెడ్డి, సునీత లాయర్ల మధ్య వాగ్వాదం జరిగింది. రాజకీయ కారణాలతోనే కేసులో ఇరికిస్తున్నారని.. హత్యతో సంబంధం ఉన్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారని అవినాష్ తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. దస్తగిరి మీడియాతో మాట్లాడిన దాన్ని సునీత లాయర్ సమర్థించడమేంటని నిలదీశారు.

అసలు వివేకా హత్యకు కారణాలేంటని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు అవినాష్ తరపు లాయర్ సమాధానమిస్తూ.. వైఎస్ వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయని కోర్టుకు తెలిపారు. వివేకా రెండో భార్యతో సునీతకు గొడవలున్నాయని, సునీల్ యాదవ్ కుటుంబంతో వివాదం, రాజకీయ కారణాలను వివేకా హత్యకు దారితీసిన పరిస్థితులుగా అవినాశ్‌ లాయర్ తెలంగాణ హైకోర్టుకు వివరించారు.

సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వివేకా హత్య రోజు అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ ఆయన ఇంటికి వెళ్లారని, వివేకా చనిపోయింది గుండెపోటుతో అని చిత్రీకరించారని సునీత లాయర్‌ కోర్టుకు తెలిపారు. ఎప్పుడు నోటీస్ ఇచ్చినా అరెస్ట్ చేయొద్దని అవినాశ్‌ కోర్టుకెళ్తున్నాడని, విచారణ అడ్డుకోవడానికే అవినాశ్‌ ప్రతీసారి ప్రయత్నిస్తున్నారని కోర్టులో సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు బదిలీ కావడానికి ప్రధాన కారణం అవినాశ్‌రెడ్డేనని సునీత తరపు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు.

Updated Date - 2023-04-18T17:09:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising