Viveka case: రేపు సీబీఐ వాదనలు వింటామన్న హైకోర్టు..
ABN, First Publish Date - 2023-05-26T17:36:26+05:30
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అవినాశ్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు ఐదున్నర గంటల పాటు వాదనలు వినిపించారు. సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సునీతా తరపు లాయర్ రవిచంద్ వాదనలు వినిపిస్తున్నారు. రేపు సీబీఐ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.
వివేకా గుండె పోటుతో చనిపోయాడని చెప్పారని, రక్తపు వాంతులతో మృతి చెందినట్లు చెప్పారని, హత్య జరిగితే.. గుండె పోటు అని ఎలా చెపుతారని సునీతారెడ్డి తరుపు న్యాయవాది వాదించారు. ఇందులో కుట్ర దాగి ఉందని, రాజారెడ్డి, గంగి రెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చి కుట్లు వేశారని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు అవినాష్ రెడ్డి, కృష్ణారెడ్డి, గంగిరెడ్డి, శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఉన్నారని సునీతారెడ్డి తరుపు న్యాయవాది రవిచంద్ వాదించారు.
Updated Date - 2023-05-26T17:41:23+05:30 IST