Rs2000 notes: రూ.2 వేల నోటు ఉపసంహరించిన మరుసటి రోజు నుంచి అనూహ్య పరిణామం.. ఒక్కసారిగా పెరిగిపోయిన..

ABN, First Publish Date - 2023-05-21T16:27:39+05:30

రెండు వేల రూపాయల నోటును (Rs 2000 notes) ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) శుక్రవారం ప్రకటించిన తర్వాత ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

Rs2000 notes: రూ.2 వేల నోటు ఉపసంహరించిన మరుసటి రోజు నుంచి అనూహ్య పరిణామం.. ఒక్కసారిగా పెరిగిపోయిన..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: రెండు వేల రూపాయల నోటును (Rs 2000 notes) ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) శుక్రవారం ప్రకటించిన తర్వాత ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, సూరత్‌తోపాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు పెరిగాయి. శనివారం నుంచి ఢిల్లీలోని రిటైల్ జువెలరీ దుకాణాలకు కస్టమర్ల రద్దీ కొనసాగుతోంది. ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు.

మెహుల్ షా అనే చార్టెడ్ అకౌంటెంట్ ఒకాయన మాట్లాడుతూ... సూరత్ మార్కెట్లో షాపులు జోరుగా బంగారాన్ని విక్రయిస్తున్నాయని, ఎక్కువ ధరకు బంగారు నగలు అమ్ముతున్నాయని తెలిపారు. 10 శాతం ఎక్కువ ధరకు అమ్ముతున్నాయని చెప్పారు. రూ.2 వేల నోట్లను బ్లాక్‌ కరెన్సీగా మారిందని మొదటి రోజుని బట్టే అర్థమవుతోందని, ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి మెహుల్ షా వ్యాఖ్యానించారు.

మిహిర్ మోదీ అనే మరో చార్టెడ్ అకౌంటెంట్ మాట్లాడుతూ... అధిక ధరతో బంగారాన్ని కొనడానికి ఉపయోగిస్తున్న డబ్బు లెక్కలోకి రానిదని (నల్లధనం) వ్యాఖ్యానించారు. ఎవరివద్దనా రూ.2 వేల నోట్లు ఉండి, అది అకౌంటెడ్ డబ్బైతే రాత్రికి రాత్రే ఎక్కువ ధరకు బంగారం ఎందుకు కొంటారని ప్రశ్నించారు.

Updated Date - 2023-05-21T16:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising