Anand Mahindra: 2023లో ఆనంద్ మహింద్రా తీర్మానం ఇదే.. ప్రేరణ ఏమిటో తెలుసా?..
ABN, First Publish Date - 2023-01-02T18:12:42+05:30
కోటి ఆశలతో నూతన సంవత్సరం 2023 (New Year) వచ్చేసింది. సరికొత్త తీర్మానాలతో ఔత్సాహికులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇలా కొత్త తీర్మానాలు చేసుకున్నవారి జాబితాలో దేశ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా (Anand Mahindra) కూడా ఉన్నారు.
న్యూఢిల్లీ: కోటి ఆశలతో నూతన సంవత్సరం 2023 (New Year) వచ్చేసింది. సరికొత్త తీర్మానాలతో ఔత్సాహికులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇలా కొత్త తీర్మానాలు చేసుకున్నవారి జాబితాలో దేశ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా (Anand Mahindra) కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ (Twitter) వేదికగా వెల్లడించారు.
‘‘ మామూలుగా అయితే కొత్త తీర్మానాలేవీ చేయను. కానీ ఒక పోస్ట్ నాకు ప్రేరణ కలిగించింది. కొత్త ఏడాదిలో ఎత్తుపల్లాలు సహజమే. అయితే ఒడిదొడుకులు, ప్రతికూల పరిస్థితులు మరింత సానుకూలంగా మారతాయని ఆశిస్తున్నాను. ఇతరుల పట్ల మరింత సానుభూతి, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకునేందుకు కష్టకాలాలను ఉపయోగించుకుంటాను’’ అని తన తీర్మానాన్ని తెలియజేశారు. అయితే ఆనంద్ మహింద్రాకు అంతలా ప్రేరణ కలిగించిన పోస్ట్ ఏమిటంటే.. ఒక యువతి బ్లాక్ బోర్డుపై చాక్‌పీస్‌తో అద్భుతమైన డ్రాయింగ్ వేసింది. నల్లటి బోర్డును తన డ్రాయింగ్‌లో చక్కగా ఉపయోగించుకుంది. ‘‘ ఈ ఆర్ట్‌లోని నల్లని ప్రదేశం వ్యక్తుల చుట్టూ, మధ్యనున్న ఖాళీ ప్రదేశం’’ అని క్యాప్షన్‌తో ఈ డ్రాయింగ్ వేస్తున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఆ వీడియోపై మీరూ చూసేయండి.
Updated Date - 2023-01-02T18:15:50+05:30 IST