ATM Card: మీ ఏటీఎం కార్డులపై Visa, Maestro అనే పదాలను గమనించారా..? అసలు వాటి అర్థమేంటంటే..!
ABN, First Publish Date - 2023-09-03T11:57:53+05:30
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పట్లో ఏటిఎం కార్డ్ తప్పనిసరిగా ఉంటోంది. ఈ కార్డ్ ల మీద వీసా, మాస్ట్రో వంటి పదాలు చూసే ఉంటారు. అసలు ఈ పదాలకు అర్థమేంటనే విషయం తెలుసా? ఏటీయం కార్డు మీద ఏ పదం ఉంటే ఏ అర్థాన్ని సూచిస్తుందంటే..
ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బున్నా చేతిలో డబ్బు లేకపోతే పనిజరిగేది కాదు. ఎక్కడైనా ఒక్క రుపాయి తక్కువైనా కావలసినది కొనుక్కోలేం, అవసరాలు తీర్చుకోలేం. కానీ ఇప్పుడలా కాదు. డిజిటల్ మనీ హవా పెరిగిన తరువాత కరెన్సీకి బ్రేక్ పడింది. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పట్లో ఏటిఎం కార్డ్ తప్పనిసరిగా ఉంటోంది. ఈ కార్డ్ ల మీద వీసా, మాస్ట్రో వంటి పదాలు చూసే ఉంటారు. అసలు ఈ పదాలకు అర్థమేంటనే విషయం తెలుసా? ఏటీయం కార్డు మీద ఏ పదం ఉంటే ఏ అర్థాన్ని సూచిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఏటీఎం కార్డులు వాడుతున్నా చాలామందికి తెలియని ఈ విషయాలు తెలుసుకుంటే..
వీసా కార్డ్.. (Visa card)
చాలామంది డెబిట్, క్రెడిట్ కార్డుల మీద వీసా అనే పేరు ఉండటం చూస్తుంటాం. వీసా కార్డ్ లు Visa Inc. బ్రాండ్ కు చెందినవి. ఇది ప్రపంచవ్యాప్తంగా చెల్లింపులను చాలా సులభతరం చేస్తుంది. అయితే ఈ వీసా సంస్థ సొంతంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు జారీ చేయదు. వీసా క్రెడిట్ కార్డులు ఉన్నవారు తీసుకున్న అప్పును నిర్ణీత గడువు లోపు తిరిగి చెల్లించని పక్షంలో ఆ తరువాత ఆ అప్పును వడ్డీతో సహా చెల్లించడానికి అనుమతి ఇస్తాయి. అయితే వీసా డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులకు ఉన్న సౌకర్యాన్ని ఇవ్వవు. కార్డు హోల్డర్ చెల్లించాల్సిన మొత్తాన్ని నేరుగా కార్డు హోల్డర్ అకౌంట్ నుండే తీసుకుంటుంది.
Health Tips: అన్నం తింటూ సులువుగా బరువు తగ్గచ్చా? ఈ బియ్యంతో అన్నం వండుకుని తింటే..
మాస్ట్రో కార్డ్..(Maestro card)
మాస్ట్రో కార్డ్ ను Mastercard Inc అనే సంస్ఠ జారీ చేస్తుంది. మాస్ట్రో కార్డ్ లను అనుబంధంగా కలిగి ఉన్న బ్యాంకుల ద్వారా ఈ కార్డును పొందవచ్చు. కార్డ్ హోల్డర్ వారి బ్యాంక్ ఖాతాలో నగదు ఉంచుకోవాలి. ఇది క్రెడిట్ కార్డ్ కాదు కాబట్టి కార్డ్ హోల్డర్ అకౌంట్ లో నగదు ఉంటే దీన్ని ఇతర డెబిట్ కార్డ్ తరహాలో వాడుకోవచ్చు. బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు ఈ కార్డ్ లో జమచేయబడుతుంది. ఎక్కడైనా నగదు చెల్లింపులు చేసేటప్పుడు కార్డు రిజెక్ట్ కాకుండా ఉండాలంటే కార్డ్ హోల్డర్ వారి బ్యాంక్ తో ఓవర్ డ్రాఫ్ట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
మాస్ట్రో, వీసా కార్డ్ ల మధ్య తేడా ఏంటంటే.. (Maestro, Visa card difference)
మాస్ట్రో, వీసా కార్డులు రెండూ ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ఠ్రానిక్ చెల్లింపుల కోసం ఉపయోగిస్తారు. వీసా కార్డులు క్రెడిట్, డెబిట్ కార్డులు రెండూ జారీ చేస్తుంది. వీసా క్రెడిట్ కార్డు సహాయంతో అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి ఆ తరువాత అప్పు తీర్చవచ్చు. కానీ మాస్ట్రో కార్డులు కేవలం డెబిట్ కార్డు మాత్రమే జారీ చేస్తుంది. మాస్ట్రో కంటే వీసా కార్డ్ ఎక్కువ ఆదరణ పొందింది. దీన్ని వినియోగించేవారు ఎక్కువ. మాస్ట్రో కార్డులు ఉపయోగించేవారు వారి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును మాత్రమే వినియోగించుకోవాలి. ఇందుకు గానూ బ్యాంక్ తో ఓవర్ డ్రాఫ్ట్ ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మాస్ట్రో కార్డ్ ఉపయోగించలేం.
Viral Video: ఆ తల్లి మనసు చిన్నపిల్లలా మారిపోయింది.. పుట్టినరోజుకు కొడుకు బహుమతి ఇస్తే ఆమె రియాక్షన్ ఇదీ..
Updated Date - 2023-09-03T11:57:53+05:30 IST