ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు 18 రోజులు సెలవు.. తెలుగు రాష్ట్రాలలో ఎన్ని రోజులు బ్యాంకులు మూతపడనున్నాయంటే..

ABN, First Publish Date - 2023-12-01T12:15:04+05:30

Bank Holidays in December: ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో యాప్స్, ఇతర మార్గాల ద్వారా డిజిటల్ లావాదేవీలు భారీగానే పెరిగాయి. అయినా సరే.. కొన్ని పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరి వెళ్లాల్సి ఉంటుంది. లోన్స్, గోల్డ్ లోన్ వంటి వాటి కోసం బ్యాంక్‌కు కచ్చితంగా వెళ్లాల్సిందే.

Bank Holidays in December: ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో యాప్స్, ఇతర మార్గాల ద్వారా డిజిటల్ లావాదేవీలు భారీగానే పెరిగాయి. అయినా సరే.. కొన్ని పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరి వెళ్లాల్సి ఉంటుంది. లోన్స్, గోల్డ్ లోన్ వంటి వాటి కోసం బ్యాంక్‌కు కచ్చితంగా వెళ్లాల్సిందే. అయితే, ప్రతి నెల బ్యాంక్‌లకు రెండో, నాల్గో శనివారం, ఆదివారాలు సెలవు ఉంటాయి. వీటితో పాటు నేషనల్ హాలీడేలు కూడా ఉంటాయి. అలాగే స్థానికంగా ఉండే పండుగల సందర్భంగా కూడా బ్యాంకులకు అప్పుడప్పుడు లీవులు ఉంటాయనే విషయం తెలిసిందే. అలా ఈ డిసెంబర్ నెల మొత్తంలో బ్యాంకులకు ఏకంగా 18రోజులు సెలవు వచ్చాయి. కనుక సెలవులకు అనుగుణంగా బ్యాంకులలో పనులు ఉన్నవారు ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్. లేనిపక్షంలో ఆఖరి నిమిషంలో టెన్షన్ తప్పదు. ఇక డిసెంబర్ మాసంలో ఏ రోజులు సెలవు వచ్చాయి.. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు ఎన్ని రోజులు మూతపడనున్నాయి.. తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ పెరిగిందోచ్.. డిసెంబర్ 1వ తారీఖు నుంచి గ్యాస్ సిలిండర్ ధర ఎంతంటే..!

డిసెంబర్‌లో బ్యాంకులకు 18 రోజులు సెలవుల వివరాలు ఇలా..

* డిసెంబర్‌ 1న ఇటానగర్‌, కోహిమాలోని బ్యాంకులకు సెలవు. ఎందుకంటే డిసెంబర్ 1న ఇండిజీనియెస్‌ ఫెయిత్‌ డేను పాటిస్తారు. అలాగే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవాలు కూడా. దీంతో అక్కడ బ్యాంకులు బంద్ ఉంటాయి.

* డిసెంబర్ 3న ఆదివారం (అన్ని రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు)

* డిసెంబర్‌ 4వ తారీఖున గోవాలో బ్యాంకులకు హాలీడే. సెంట్​ఫ్రాన్సిస్​ జెవియర్​ ఫీస్ట్ సందర్భంగా సెలవు ఉంటుంది.

* డిసెంబర్ 9న రెండో శనివారం (అన్ని రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు)

* డిసెంబర్ 10వ తేదీన ఆదివారం (అన్ని రాష్ట్రాలలో బ్యాంకులు క్లోజ్)

* డిసెంబర్‌ 12వ తేదీన షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు ఉంది. పా-టోగన్​నెంజ్​మింగ్​సాగ్మను పురస్కరించుకొని ఇక్కడ బ్యాంకులకు హాలీడే ఇవ్వడం జరిగింది.

* డిసెంబర్‌ 13, 14 తేదీల్లో గ్యాంగ్‌టక్‌లోని బ్యాంకులు మూతపడనున్నాయి. దీనికి కారణం నాన్‌సూంగ్‌.

* డిసెంబర్ 17 ఆదివారం (అన్ని రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు)

* డిసెంబర్ 18వ తారీఖున షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సోసో థామ్​వర్థంతి సందర్భంగా సెలవు ఇచ్చారు.

* డిసెంబర్‌ 19న పనాజీలో 'గోవా లిబరేషన్​డే'ను పురస్కరించుకొని బ్యాంక్‌లు మూతపడనున్నాయి.

* డిసెంబర్ 23 నాలుగో శనివారం (అన్ని రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు), డిసెంబర్ 24న ఆదివారం బ్యాంకులు బంద్.

* డిసెంబర్‌ 25వ తేదీ సోమవారం రోజున క్రైస్తవుల అతిపెద్ద పండుగ క్రిస్మస్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలీడే ఉంటుంది.

* డిసెంబర్‌ 26వ తేదీన కూడా క్రిస్మస్​వేడుకల సందర్భంగానే ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్‌లోని బ్యాంక్‌లకు సెలవు ఇవ్వడం జరిగింది.

* క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా డిసెంబర్‌ 27వ తేదీన బుధవారం నాగాలాండ్ రాజధాని కోహిమాలోని బ్యాంకులకు సెలవు ఇచ్చారు.

* షిల్లాంగ్‌లోకి బ్యాంకులకు డిసెంబర్‌ 30వ తేదీ శనివారం.. యూ కయాంగ్​ నాంగ్​బాహ్ సందర్భంగా బ్యాంక్‌లకు హాలీడేగా డిక్లేర్ చేశారు.

* డిసెంబర్ 31న సండే కనుక యధావిధిగా అన్ని రాష్ట్రాలలో బ్యాంకులు క్లోజ్ ఉంటాయి. ఇలా డిసెంబర్ నెల మొత్తం 18 రోజులు హాలీడేస్ వచ్చాయి. కనుక ఈ సెలవులకు అనుగుణంగా మీ బ్యాంకు పనులను షెడ్యూల్ చేసుకుంటే బెటర్.

Viral Video: భవిష్యత్తులో జరిగేది ఇదే.. అమెరికాలో ఈ భారతీయ యువతికి షాకింగ్ అనుభవం.. కారు ఎక్కగానే..!


Updated Date - 2023-12-01T12:21:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising