ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BSNL Offer: ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

ABN, First Publish Date - 2023-04-10T21:01:23+05:30

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్లతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్లతో ఖాతాదారులను ఆకర్షిస్తూ వస్తోంది. ముఖ్యంగా అపరిమిత వాయిస్ కాల్స్, డేటా కోరుకునే వారి కోసం అద్భుతమైన ప్లాన్లు తీసుకొస్తోంది. ఇందులో పలు రకాలైన ప్లాన్లు ఉన్నాయి. తాజాగా, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ. 269తో తీసుకొచ్చిన ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు.

ఈ ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ ప్లాన్‌లో వినియోగదారులకు అపరమితమైన కాల్స్‌తోపాటు ముంబై, ఢిల్లీలో నేషనల్ రోమింగ్, అపరిమిత డేటా లభిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా పరిమితి దాటిన తర్వాత వేగం 40 కేబీపీఎస్‌కు పడిపోతుంది. అలాగే, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పంపుకోవచ్చు. కాలపరిమితి 28 రోజులు.

డేటా, వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలకు అదనంగా ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఇందులో ఈరోస్ నౌ (EROS Now), లిస్టన్ పాడ్‌కాస్ట్ సర్వీసులు(Lystn podcast services), లోక్‌ధన్ కంటెంట్ (Lokdhun Content), జింగ్ మ్యూజిక్ ( Zing Music) వంటివి ఉన్నాయి.

గేమింగ్ బెనిఫిట్స్‌లో హార్డీ గేమ్స్, చాలెంజెస్ అరేనా మొబైల్ గేమింగ్ సర్వీస్, ఆస్ట్రోసెల్, గేమ్ ఆన్ సర్వీసులు, గేమియమ్ వంటివి ఉన్నాయి. అలాగే, బీఎస్ఎనల్ ట్యూన్స్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.

Updated Date - 2023-04-10T21:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising