హిందీ భాష అమలులో కెనరా బ్యాంక్ భేష్
ABN , Publish Date - Dec 19 , 2023 | 02:05 AM
అధికార భాష హిందీ అమలులో కెనరా బ్యాంక్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కే సత్యనారాయణ రాజు పేర్కొన్నారు...

ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజు
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): అధికార భాష హిందీ అమలులో కెనరా బ్యాంక్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కే సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. బెంగళూరులోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (బ్యాంక్స్, ఇన్సూరెన్స్) 76వ అర్ధ సంవత్సర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంక్ దైనందిన కార్యకలాపాలు, సాంస్కృతిక కార్యకలాపాలలో అధికారభాష హిందీ అమలుకు మరింతగా చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం 48వ ప్రయాస్ మ్యాగజైన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ చంద్ర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రాంతీయ డైరెక్టర్ సోనాలీ సేన్ గుప్తా, ఆర్‌బీఐ ఎండీ మహేశ్‌కుమార్ మాల్, అధికార భాష అమలుకు సంబంధించిన దక్షిణాది విభాగ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ అనిర్బన్ కుమార్ బిశ్వా్‌సతో పాటు వివిధ బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విజేతలను రాజభాషా పత్రికా పురస్కార్ 2023తో సత్కరించారు.