ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SBI: రూ.2000 నోట్ల ఉపసంహరణ తర్వాత ముఖ్యమైన విషయాన్ని వెల్లడించిన ఎస్‌బీఐ..

ABN, First Publish Date - 2023-06-19T20:10:51+05:30

దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2 వేల నోటు ఉపసంహరణపై (Rs 2000 notes) అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ (SBI) కీలక రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలో డిపాజిట్లు, రుణాలు, వినియోగంపై ఈ పెద్ద నోటు ఉపసంహరణ గణనీయ ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేసింది. వినియోగ డిమాండ్ రూ.55 వేల కోట్ల మొత్తంలో పెరగొచ్చని విశ్లేషించింది. రూ.2 వేల నోటు ఉపసంహరణ ఫలితాల్లో వినియోగ డిమాండ్ తక్షణం పెరుగుదల ఒకటని తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2 వేల నోటు ఉపసంహరణపై (Rs 2000 notes) అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ (SBI) కీలక రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలో డిపాజిట్లు, రుణాలు, వినియోగంపై ఈ పెద్ద నోటు ఉపసంహరణ గణనీయ ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేసింది. వినియోగ డిమాండ్ రూ.55 వేల కోట్ల మొత్తంలో పెరగొచ్చని విశ్లేషించింది. రూ.2 వేల నోటు ఉపసంహరణ ఫలితాల్లో వినియోగ డిమాండ్ తక్షణం పెరుగుదల ఒకటని తెలిపింది. నోట్ల రద్దు మాదిరిగా కాకుండా రూ.2 వేల నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి ఊతమిస్తుందని ఎస్‌బీఐ రిపోర్ట్ లెక్కగట్టింది. బంగారు, నగలు, ఏసీ, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి అధిక వ్యాల్యూ ఉన్న వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయని తెలిపింది.

ఉదాహరణకు నగదు లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. పెద్ద ఎత్తున రూ.2 వేల నోట్లు చెలామణిలోకి వచ్చాయి. ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (AIPDA) విడుదల చేసిన రిపోర్ట్ ఇందుకు అద్దం పడుతోంది. రూ.2 నోట్ల ఉపసంహరణకు ముందు అమ్మకాల్లో 40 శాతంగా ఉన్న డిజిటల్ పేమెంట్లు భారీగా తగ్గాయని వివరించింది.

క్యాష్ ఆన్ డెలివరీల్లోనూ పెరుగుదల..

పెద్ద నోటు ఉపసంహరణ తర్వాత క్యాష్ ఆన్ డెలివరీలు కూడా పెరిగాయి. క్యాష్ ఆన్ డెలివరీపై ఆర్డర్లు చేసే వారి సంఖ్య పెరిగిందని ఎస్బీఐ రిపోర్ట్ పేర్కొంది. జొమాటో యూజర్లలో 75 శాతం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంటుండగా.. వారిలో రూ.2 వేల నోట్లు చెల్లిస్తున్నవారు కూడా ఉన్నారు. ఇక గృహోపకరణాల విక్రయాలు కూడా పెరిగాయని ఎస్‌బీఐ రిపోర్ట్ ప్రస్తావించింది. రూ.2 వేల నోటు ఉపసంహరణ కారణంగా దేశంలో నగదుపై పెద్దగా ప్రభావం చూపబోదని చెప్పింది. ఇక రుణాల పరంగా చూస్తే.. డిపాజిట్లలో 30 శాతం అంటే దాదాపు రూ.92,000 కోట్లు రుణాలకు పోయే అవకాశం ఉందని వివరించింది. మున్ముందు కూడా రుణ జారీ పెరిగే అవకాశముందని విశ్లేషించింది. మొత్తంగా జీడీపీ వృద్ధి రేటుకు ఇది సానుకూలమవుతుందని తెలిపింది.


******************************

ఇవి కూడా చదవండి..

******************************

WhatsApp Tips and tricks: వాట్సప్‌లో మెసేజ్ పంపించిన వ్యక్తికి తెలియకుండా చదివేందుకు ట్రిక్స్ ఇవే..

******************************

Updated Date - 2023-06-19T20:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising