ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Customize Jio Number: జియో ఫ్యాన్సీ నెంబర్ పొందడం ఇకపై చాలా ఈజీ.. వివరాలివిగో..

ABN, First Publish Date - 2023-07-07T21:43:57+05:30

జియో(JIO) సంస్థ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.పోస్ట్ పెయిడ్(Post paid) లేదా ప్రీ పెయిడ్‌(Prepaid)లో తమ అభిరుచికి తగ్గట్టుగా మొబైల్ నెంబర్లను ఎంచుకునేలా జియో నెట్‌వర్క్ అవకాశం కల్పిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జియో(JIO) సంస్థ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో జియో ఫోన్ నెంబర్లను(Mobile Numbers) సెలక్ట్ చేసుకునే అవకాశం పరిమితంగా ఉండేది. దీంతో కస్టమర్లు జియో నెట్‌వర్క్‌(Jio Networks)ను వదిలిన సందర్భాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని జియో నెట్‌వర్క్ నెంబర్స్ స్కీంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. పోస్ట్ పెయిడ్(Post paid) లేదా ప్రీ పెయిడ్‌(Prepaid)లో తమ అభిరుచికి తగ్గట్టుగా మొబైల్ నెంబర్లను ఎంచుకునేలా జియో నెట్‌వర్క్ అవకాశం కల్పిస్తోంది.. అంటే జియో వినియోగదారులు ఇప్పుడు ఎలాంటి తమకు ఇష్టమైన నెంబర్లను పొందొచ్చు. మొబైల్ నెంబర్‌లో చివరి 4 నుంచి 6 డిజిట్స్ మార్చుకునే అవకాశం కల్పించింది.

లక్కీ నెంబర్, బర్త్ డేట్, ఇష్టమైన సీరిస్ వంటి ఫ్యాన్సీ నెంబర్లుగా తమ మొబైల్ నెంబర్లను మార్చుకోవచ్చు. రిలయన్స్ జియో నెంబర్లను మార్చుకునేందుకు ఈ క్రింది విధంగా చేయాలి.

  • 1. మీ మొబైల్‌లో jio.com లేదా MyJio app లాగిన్ అయి.. Self Care Section యాక్సెస్ చేయాలి.

  • 2. వెబ్‌సైట్‌లో అయితే Choice Number Section, MyJio appలో అయితే Choice Number క్లిక్ చేసి మీ కిష్టమైన నెంబర్లను వెదకాలి.

  • 3. 4 నుంచి 6డిజిట్లను ఎంటర్ చేసి మీకిష్టమైన మొబైల్ నెంబర్లను ఎంచుకోండి.

  • 4. పేమెంట్ సెక్షన్‌లోకి వెళ్లి రూ. 499 లు చెల్లించాలి. పేమెంట్ అవగానే మీరు ఎంచుకున్న జియో నెంబర్ 24 గంటల్లో యాక్టివేట్ అవుతుంది.

కాగా.. అత్యంత సరసమైన ధరలో జియో భారత్ వి2 పేరుతో 4జిను జియో సంస్థ శుక్రవారం విడుదల చేసింది. దీని ధర రూ. 999 మాత్రమే. ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఇది దేశంలోనే అతితక్కువ ధరలో ఇంటర్నెట్ అందిస్తున్న ఫోన్‌గా చెప్పుకోవచ్చు. ఫిజికల్ కీప్యాడ్, స్మాల్ స్క్రీన్‌తో ఈ ఫోన్ సాధారణ ఫీచర్ ఫోన్ మాదిరిగానే ఉంటుంది. ఇది బ్లూ, రెడ్ కలర్లతో లభిస్తుంది. ఇది నెలవారి ఆఫర్లను కూడా అందిస్తోంది. ఇతర నెట్‌వర్క్‌లతో పోల్చుకుంటే 30 శాతం తక్కువ, 7రెట్లు అదనంగా డేటాను అందిస్తోంది.

Updated Date - 2023-07-07T21:51:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising