Layoffs: డిస్నీలో లేఆఫ్...7వేల మంది ఉద్యోగుల తొలగింపు
ABN, First Publish Date - 2023-02-09T10:03:00+05:30
డిస్నీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.ఆర్థిక సంక్షోభం వల్ల డిస్నీ గురువారం లేఆఫ్...
శాన్ ఫ్రాన్సిస్కో: డిస్నీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.ఆర్థిక సంక్షోభం వల్ల డిస్నీ గురువారం లేఆఫ్ ప్రకటించింది.(Layoffs) స్ట్రీమింగ్ సబ్‌స్క్రైబర్‌లు తగ్గడంతో(Streaming Subscribers Decline) డిస్నీ(Disney) 7,000 మంది ఉద్యోగులను(Employees) తొలగించింది. కరోనా మహమ్మారి వల్ల పలు టెక్ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. 7వేలమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డిస్నీకి 1,90,000 మంది ఉద్యోగులున్నారు. వాల్ట్ డిస్నీ స్థాపించిన స్టోరీడ్ కంపెనీ తన స్ట్రీమింగ్ సర్వీస్ చందాదారుల సంఖ్య మొదటిసారి పడిపోయింది.20వ సెంచరీ ఫాక్స్ చలనచిత్ర స్టూడియోను కొనుగోలు చేయడానికి డిస్నీ అధిక చెల్లింపులు చేసింది.
Updated Date - 2023-02-09T10:03:02+05:30 IST