ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Syngenta: వ్యవసాయ రంగంలో డ్రోన్లు.. చేతులు కలిపిన సిన్జెంటా-ఐవోటెక్

ABN, First Publish Date - 2023-02-10T18:44:43+05:30

వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల(Drones)ను పెద్ద ఎత్తున ఉపయోగించాలన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల(Drones)ను పెద్ద ఎత్తున ఉపయోగించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యానికి అనుగుణంగా సిన్జెంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SIPL).. ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్ (IoTechWorld Avigation)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా డ్రోన్ స్ప్రేయింగ్‌(Drone Spraying)ను పరిచయం చేయబోతోంది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు కంపెనీలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పనిచేయడంతోపాటు డ్రోన్ సాంకేతికతను సిద్ధం చేయనున్నాయి.

ఎస్ఐపీఎల్, ఐవోటెక్ కలిసి దేశంలోని విభిన్న ప్రాంతాల్లో డ్రోన్ సాంకేతికతను వినియోగించి పంటల్లో రసాయనాలను స్ప్రే చేయడంపై కలిసి పనిచేస్తాయి. ఇందులో భాగంగా తొలి దశలో 200 మంది గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి స్ప్రేయింగ్ విధుల్లో నియమించనున్నాయి. 400 ఎకరాలపై ట్రయల్స్ చేసిన తర్వాత 20 పంటలకు సంబంధించిన డేటాను రెగ్యులేటర్లకు సమర్పించినట్టు సిన్జెంటా ఎండీ (కంట్రీ హెడ్‌) సుశీల్‌ కుమార్‌ అన్నారు.

సిన్జెంటా స్ర్పే సేవలు,ఉత్పత్తుల వ్యాప్తంగా ఐవో టెక్‌ డ్రోన్‌ అగ్రిబాట్‌ను వినియోగించనున్నారు. భారత ప్రభుత్వ సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ బోర్డ్‌ నుంచి అనుమతులు పొందిన మొదటి ప్రైవేట్‌ కంపెనీగా సిన్జెంటా పేరుపొందింది. ఈ అనుమతులు అందించిన ప్రోత్సాహంతోనే సిన్జెంటా ఇప్పుడు వినూత్నమైన డ్రోన్‌ యాత్ర చేస్తోంది. దీనిలో భాగంగా 13 రాష్ట్రాల్లో 17వేల కిలోమీటర్లు మేర వ్యాన్‌లో తిరుగుతూ డ్రోన్‌ స్ర్పేయింగ్‌ పట్ల అవగాహన కల్పించనున్నట్టు సిన్జెంటా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫార్మర్‌ సెంట్రిక్‌ ఎకోసిస్టమ్‌ హెడ్‌ సచిన్‌ కమ్రా పేర్కొన్నారు.

స్ప్రేయింగ్ పరంగా దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్టు ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్ డైరెక్టర్ దీపక్‌ భరద్వాజ్‌ తెలిపారు. సిన్జెంటా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఐవోటెక్‌ల ఉమ్మడి ప్రయత్నాలలో భాగంగా అర్హులైన అగ్రి ఎంటర్‌ప్రిన్యూర్స్‌ (AEs)ను గుర్తించి డ్రోన్‌ పైలెట్‌ శిక్షణను సిన్జెంటా ఫౌండేషన్‌ ఇండియా అందిస్తుందని సంస్థ కంట్రీ డైరెక్టర్‌ రాజేంద్ర జోగ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-10T18:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising