ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Elon Musk: ఎలాన్ మస్క్ మంచి మనస్సు.. ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీగా విరాళం

ABN, First Publish Date - 2023-11-22T09:10:52+05:30

ఎక్స్(ట్విటర్) సీఈఓ ఎలాన్ మస్క్ తన మంచి మనసును చాటుకున్నారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీగా విరాళం ప్రకటించారు.

ఎక్స్(ట్విటర్) సీఈఓ ఎలాన్ మస్క్ తన మంచి మనసును చాటుకున్నారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీగా విరాళం ప్రకటించారు. తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు, చందాల నుంచి వచ్చే మొత్తం ఆదాయాన్ని అక్కడి ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మొత్తం ఆదాయాన్ని ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులకు, గాజాలోని రెడ్ క్రాస్ లేదా క్రెసెంట్‌కు విరాళంగా ఇస్తామని ఈ టెక్ బిలియనీర్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. ‘‘గాజాలో యుద్ధానికి సంబంధించిన ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులకు, గాజాలోని రెడ్‌క్రాస్/క్రెసెంట్‌కు ఎక్స్ కార్ప్ విరాళంగా అందజేస్తుంది.’’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


అయితే ఎక్స్‌లో ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనను చూసిన ఓ వినియోగదారుడు.. ఇలా విరాళం ఇచ్చిన మొత్తం డబ్బులు హమాస్ మిలిటెంట్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికి స్పందించిన మస్క్ తాము ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారనమే విషయమై తమ కంపెనీ ట్రాక్ చేస్తుందని పేర్కొన్నారు. ‘‘మేము నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారనే విషయమై ట్రాక్ చేస్తాం. రెడ్ క్రాస్ లేదా క్రెసెంట్ ద్వారా మేము ఈ నిధులను ఖర్చు చేస్తాం. మంచి ఆలోచలకు స్వాగతం’’ అని మస్క్ అన్నారు. జాతి, మతం, మరేదైనా సరే తాము అమాయకుల పట్ల శ్రద్ధ వహిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే పాలస్తీనా రెడ్ క్రెసెంట్ భవనాన్ని హమాస్ మిలిటెంట్లు తమ కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటున్నారని పేర్కొంటూ మరో ఎక్స్ వినయోగదారుడు అందుకు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన మస్క్ ఇలా రాశారు. “సరే. గాజాలో పిల్లలకు సహాయం చేయడానికి మంచి మార్గం ఏమిటి? పీడియాట్రిక్ మెడికల్ సామగ్రిని నేరుగా కొనుగోలు చేయవచ్చా?" అని ప్రశ్నించారు.

నిధులను ఎలా ఉపయోగిస్తారనే విషయాన్ని పక్కనపెడితే ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయం పట్ల అంతటా హర్షం వ్యక్తమవుతుంది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ప్రస్తుతం దయనీయ పరిస్థితులు నెలకొలన్నాయి. హమస్ మిలిటెంట్లు ఉన్నారనే అనుమానంతో ఇజ్రాయెల్ సైన్యం ఆసుపత్రులపై కూడా దాడి చేసింది. ఈ దాడిలో అనేక ఆసుపత్రులు నాశనమయ్యాయి. దీంతో యుద్ధంలో గాయపడిని వారికి, సాధారణ రోగులకు సరైన చికిత్స కూడా అందడం లేదు. చికిత్సకు అవసరమైన మందుల కొరత కూడా నెలకొంది. ఈ క్రమంలో అనేక మంది బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ఎలాన్ మస్క్ ప్రకటించిన సాయం గాజాకు చాలావరకు ఉపయోగపడనుంది. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ యుద్ధంలో 4 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో రెండు వైపుల బందీలుగా ఉన్న వారిలో పలువురికి విముక్తి కూడా లభించనుంది. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో 50 మందిని విడుదల చేయనున్నారు. అలాగే ఇజ్రాయెల్ చెరలో ఉన్న పలువురు పాలస్తీనా ఖైదీలు కూడా విడుదలకానున్నారు.

Updated Date - 2023-11-22T09:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising