Lay off: ఫేస్‌బుక్ మెటాలో మళ్లీ ఉద్యోగాల కోత
ABN, First Publish Date - 2023-03-11T08:27:24+05:30
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫారమ్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది....
శాన్‌ఫ్రాన్సిస్కో: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫారమ్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.(Facebook-Parent Meta) రాబోయే కొద్ది నెలల్లో పలు రౌండ్లలో అదనంగా ఉద్యోగుల తొలగింపులు ప్రకటించనుంది.(Lay off)వచ్చే వారం కొత్తగా ఉద్యోగాల కోత విధించాలని మెటా యోచిస్తోంది. ఇప్పటికే మెటా గత సంవత్సరం 13 శాతం ఉద్యోగులను తొలగించింది.నాలుగు నెలల క్రితం 11వేల మంది ఉద్యోగులను మెటా తొలగించింది.
ఇది కూడా చదవండి : Gujarat : గోద్రా అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా గుజరాత్ అసెంబ్లీ తీర్మానం
మెటా తాజా లే ఆఫ్ లతో రెండవ రౌండ్ ఉద్యోగులను తొలగించే టెక్ కంపెనీగా ఫేస్ బుక్ నిలవనుంది.(Cut More Jobs) ఫేస్ బుక్ లోని కొన్ని ప్రాజెక్టుల్లోని ఉద్యోగుల బృందాలను మూసివేసి ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
Updated Date - 2023-03-11T08:27:24+05:30 IST