Google Apps: వినియోగదారుల భద్రతకు ముప్పు.. కారణమైన 18 లోన్ యాప్‌లను తొలగించిన గూగుల్
ABN, First Publish Date - 2023-12-08T10:53:23+05:30
వినియోగదారుల భద్రతను అడ్డుగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్న 18 లోన్ యాప్‌లను గూగుల్ తొలగించింది. వాటిల్లో చాలా వరకు కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నవే కావడం గమనార్హం. వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు.
ఆఫ్రికా: వినియోగదారుల భద్రతను అడ్డుగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్న 18 లోన్ యాప్‌లను గూగుల్ తొలగించింది. వాటిల్లో చాలా వరకు కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నవే కావడం గమనార్హం.
వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. యూజర్స్ భద్రతకు ముప్పు వాటిల్లేలా 18 యాప్ లు గూఢ చర్యం చేస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. ఈ యాప్ లు వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో సమాచారం సేకరించి వారిపై నిఘా ఉంచాయి.
సేకరించిన సమాచారాన్ని ఉపయోగించుకుని రుణ గ్రహీతలకు బ్లాక్ మెయిల్ చేయడం, అధిక వడ్డీలను వసూలు చేస్తూ దోపిడీకి తెరతీశాయి. ఈ యాప్ లు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలో నివసిస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ESET పరిశోధకులు వెల్లడించారు. వీటిని వినియోగదారులు తమ ఫోన్ల నుంచి తొలగించాలని గూగుల్ యాజమాన్యం సూచించింది. ఆ యాప్‌లేంటంటే?
AA Kredit
Amor Cash
GuayabaCash
EasyCredit
Cashwow
CrediBus
FlashLoan
PréstamosCrédito
Préstamos De Crédito-YumiCash
Go Crédito
Instantáneo Préstamo
Cartera grande
Rápido Crédito
Finupp Lending
4S Cash
TrueNaira
EasyCash
Updated Date - 2023-12-08T10:57:42+05:30 IST