GST revenue: ఏప్రిల్‌లో రికార్డులు బద్ధలయ్యేలా జీఎస్టీ వసూళ్లు.. ఆదాయం ఎంతంటే...

ABN, First Publish Date - 2023-05-01T19:38:57+05:30

జీఎస్టీ వసూళ్లు (GST collections) రికార్డు సృష్టించాయి. ఏప్రిల్ 2023 నెల జీఎస్టీ స్థూల ఆదాయం రికార్డ్ స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యింది.

GST revenue: ఏప్రిల్‌లో రికార్డులు బద్ధలయ్యేలా జీఎస్టీ వసూళ్లు.. ఆదాయం ఎంతంటే...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు (GST collections) రికార్డు సృష్టించాయి. ఏప్రిల్ 2023 నెల జీఎస్టీ స్థూల ఆదాయం రికార్డ్ స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇందులో సీజీఎస్టీ రూ.38,440 కోట్లుగా, ఎస్‌జీఎస్టీ రూ.47,412 కోట్లుగా, ఐజీఎస్టీ రూ.89,158 కోట్లుగా ఉంది. ఇక సెస్ రూ.12,025 కోట్లుగా ఉంది. కాగా జీఎస్టీ విధానం ప్రవేశపెట్టాక ఇదే జీవితకాల గరిష్ఠంగా ఉంది. కాగా గతేడాది 2022 ఏప్రిల్ నెలలో ఆదాయం రూ.1,67,540 కోట్లుగా ఉంది. ఏడాదిపరంగా చూస్తే 12 శాతం వృద్ధి నమోదయ్యింది. 20 ఏప్రిల్ 2023న అద్భుతమే జరిగింది. ఈ ఒక్క రోజే ఏకంగా రూ.68,228 కోట్ల ట్యాక్స్ వసూలైంది. 9.8 లక్షల లావాదేవీల ద్వారా ఈ ఆదాయం వచ్చింది. గరిష్ఠ ఒక్క రోజు ఆదాయంగా ఇది రికార్డయ్యిందని ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది.

కాగా ఏప్రిల్ 2023లో తొలిసారి జీఎస్టీ ఆదాయం రూ.1.75 లక్షల కోట్లు దాటింది. ఈ నెలలో ఈ - వే (e-way bills) సంఖ్య 9 కోట్లుగా ఉంది. ఫిబ్రవరి 2023 నెలలో రికార్డయిన 8.1 కోట్లతో పోల్చితే 11 శాతం అధికంగా ఉంది.

Updated Date - 2023-05-01T19:38:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising