IndiGo:ఎయిర్ ఇండియా బాటలో ఇండిగో...కొత్తగా 500 విమానాల కొనుగోలుకు నిర్ణయం
ABN, First Publish Date - 2023-02-18T11:27:58+05:30
ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా బాటలో నడుస్తోంది....
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా బాటలో నడుస్తోంది.(IndiGo Follows Air India) తాజాగా ఐరోపా దేశాలకు రాకపోకలు సాగించడానికి ఇండిగో కొత్తగా 500 విమానాలను(500 Aircraft to Expand) ఆర్డర్ చేసింది.ఇండిగో ప్రస్తుతం రోజుకు 1800 విమానాలను నడుపుతోంది, వాటిలో కేవలం 10 శాతం మాత్రమే అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీంతో కొత్తగా 500 విమానాల ఆర్డర్‌తో ఇండిగో కార్యకలాపాలు విస్తరించనున్నాయి.
ఇది కూడా చదవండి : Cheetahs: ఐఏఎఫ్ కార్గో విమానంలో గ్వాలియర్ వచ్చిన ఆఫ్రికన్ చీతాలు
ఇండిగో యూరప్ లో(Europe) తన ఉనికిని పెంచుకోవడానికి టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో(Turkish Airlines) భాగస్వామ్యం ఏర్పరచుకుంది.ఇండిగో విమానాలు భారతదేశం నుంచి ఇస్తాంబుల్, ఐరోపాకు నడుపుతామని మల్హోత్రా తెలిపారు.ఇండిగో అమెరికన్ బోయింగ్,భారీ యూరోపియన్ ఎయిర్‌బస్ రెండింటికీ ఆర్డర్లు ఇచ్చింది.ఇండిగో భారతదేశం నుంచి ఇస్తాంబుల్‌కు, ఇస్తాంబుల్ నుంచి వెలుపలకు ప్రయాణీకులను తీసుకువెళ్లగలదని మల్హోత్రా చెప్పారు.
ఇది కూడా చదవండి : Nikki Yadav Case: ఢిల్లీ నిక్కీయాదవ్ కేసులో కొత్త ట్విస్ట్
ఐరోపాకు వెళ్లడానికి ప్రజలు ఇండిగోను ఎందుకు ఎంచుకోవాలి అని అడిగినప్పుడు, ఇతర విమానయాన సంస్థలు ఏవీ లేవని తాము యూరప్‌కు ఉత్తమమైన కనెక్టివిటీని అందిస్తున్నామని మల్హోత్రా చెప్పారు. ఇండిగో ప్రయాణికులకు అవాంతరాలు లేని క్యారియర్ సేవలు, ఆన్-టైమ్ పనితీరు, సరసమైన ధరలకు హామీ ఇస్తుందని మల్హోత్రా వివరించారు.
Updated Date - 2023-02-18T11:40:22+05:30 IST