poultry : తగ్గిన మొక్కజొన్న, సోయా ధర పెరగనున్న పౌలీ్ట్ర సంస్థల ఆదాయం
ABN , Publish Date - Dec 27 , 2023 | 05:02 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) కోళ్ల పరిశ్రమ (పౌలీ్ట్ర)కు బాగానే కలిసి రానుంది. దాణాలో ప్రధాన ముడి పదార్ధాలైన మొక్కజొన్న, సోయా ధరలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) కోళ్ల పరిశ్రమ (పౌలీ్ట్ర)కు బాగానే కలిసి రానుంది. దాణాలో ప్రధాన ముడి పదార్ధాలైన మొక్కజొన్న, సోయా ధరలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్థ భాగంలో 9 నుంచి 21 శాతం తగ్గాయి. ఇదే సమయంలో కిలో బ్రాయిలర్ చికెన్‌పై లభించే ఆదాయం రూ.101 నుంచి రూ.107కు పెరిగింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సర పౌలీ్ట్ర పరిశ్రమ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఎనిమిది నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉందని పరపతి రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ అంచనా. గుడ్లు, చికెన్ అమ్మకాల పరిమాణం పెరగడం, కార్పొరేట్ సంస్థల పాత్ర పెరగడం ఇందుకు ప్రధాన కారణం. పండగల సీజన్ అమ్మకాలు, చలికాలం కూడా ఇందుకు కలిసి రానున్నాయి.
దాణా ధర పెరిగే అవకాశం: అయితే ఖరీఫ్ సీజన్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న, సోయా సాగు ఆలస్యమైంది. ఇది దిగుబడులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే జరిగితే దాణా ధరలు మళ్లీ పెరిగి పౌలీ్ట్ర పరిశ్రమ కష్టాల్లో పడే ప్రమాదం ఉందని కూడా ఇక్రా హెచ్చరించింది. ఈ ఆర్థిక సంవత్సరం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కనిపించినా, అది ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కట్టడి చేయడంలో అధికారులు విజయం సాధించినట్టు తెలిపింది.’