ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RIL: ముకేష్ అంబానీ పిల్లలకు శాలరీ వద్దు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక తీర్మానం

ABN, First Publish Date - 2023-09-26T19:18:31+05:30

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ ముగ్గురు పిల్లలను బోర్డు సభ్యులుగా నియమించేందుకు షేర్ హోల్డర్ల అనుమతిని కంపెనీ కోరింది. ఈ మేరకు కంపెనీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆకాశ్, ఇషా, అనంత అంబానీలు బోర్డు మీటింగులు, కమిటీ సమావేశాల్లో పాల్గొన్నందుకుగానూ ఫీజుల రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, శాలరీ ఉండబోదని తీర్మానంలో కంపెనీ పేర్కొంది.

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ ముగ్గురు పిల్లలను బోర్డు సభ్యులుగా నియమించేందుకు షేర్ హోల్డర్ల అనుమతిని కంపెనీ కోరింది. ఈ మేరకు కంపెనీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆకాశ్, ఇషా, అనంత అంబానీలు బోర్డు మీటింగులు, కమిటీ సమావేశాల్లో పాల్గొన్నందుకుగానూ ఫీజుల రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, శాలరీ ఉండబోదని తీర్మానంలో కంపెనీ పేర్కొంది. కాగా ముకేష్ అంబానీ కూడా 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి శాలరీ తీసుకోవడంలేదనే విషయం తెలిసిందే. అయితే ఇందుకు విరుద్ధంగా బోర్డులోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అందరూ జీతంతోపాటు ఉద్యోగుల ప్రయోజనాలు, అలవెన్సులు, కమీషన్లు పొందుతున్నారు.


వీరి ముగ్గురి నియామకం కోసం పోస్టల్ బ్యాలెట్ రూపంలో షేర్ హోల్డర్ల అనుమతి కోరారు. ఇక 2014లో కంపెనీ బోర్డ్ సభ్యురాలిగా చేరిన నీతా అంబానీ మాదిరిగానే పిల్లలకు కూడా ఫీజుల రూపంలో చెల్లింపులు ఉంటాయని షేర్ హోల్డర్లకు కంపెనీ వివరించింది. ఇదిలావుండగా తన ముగ్గురు పిల్లలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులోకి తీసుకుంటున్నట్టు వార్షిక సర్వసాధారణ సమావేశంలో ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరో ఐదేళ్లపాటు కంపెనీ చైర్మన్, సీఈవో బాధ్యతలు తానే చేపడతానని ముకేష్ అంబానీ తెలిపారు.

Updated Date - 2023-09-26T19:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising