Home » RIL
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఆయిల్ నుంచి టెలికం వరకు బహుళ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఈ దేశీయ వ్యాపార దిగ్గజం మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.20 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి సంబంధించి టెక్ రంగ కంపెనీలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధన రంగ కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉండడంతో వారాంతం శుక్రవారం నాడు మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి.
భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) 100 బిలియన్ డాలర్ల సంపన్నుల జాబితాలోకి తిరిగి ప్రవేశించారు. గడిచిన వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు గణనీయంగా వృద్ధి చెందడంతో ఆయన సంపద పెరిగింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ ముగ్గురు పిల్లలను బోర్డు సభ్యులుగా నియమించేందుకు షేర్ హోల్డర్ల అనుమతిని కంపెనీ కోరింది. ఈ మేరకు కంపెనీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆకాశ్, ఇషా, అనంత అంబానీలు బోర్డు మీటింగులు, కమిటీ సమావేశాల్లో పాల్గొన్నందుకుగానూ ఫీజుల రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, శాలరీ ఉండబోదని తీర్మానంలో కంపెనీ పేర్కొంది.