Layoffs: పేపాల్‌లో లే ఆఫ్...2వేలమంది ఉద్యోగుల తొలగింపు
ABN, First Publish Date - 2023-02-01T09:29:29+05:30
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు పర్వానికి తెర పడటం లేదు...
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు పర్వానికి తెర పడటం లేదు.(Layoffs) పేపాల్ కంపెనీ 2వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. పేపాల్ హోల్డింగ్స్ ఇంక్ త్రైమాసికంలో స్థూల ఆర్థిక మందగమనంతో 2,000 మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు(Jobs cut) తెలిపింది.7శాతం మంది ఉద్యోగులపై ప్రభావం చూపేలా ఉద్యోగుల కోత రానున్న వారాల్లో జరుగుతాయని పేపాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ షుల్మాన్ ఉద్యోగులకు పంపిన మెమోలో తెలిపారు.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టాక చెల్లింపుల పరిమాణంలో వృద్ధి మందగించడంతో పేపాల్ స్టాక్ దెబ్బతింది. దీంతో పేపాల్ కంపెనీలో ఉద్యోగాల కోతతోపాటు కార్యాలయాల మూసివేతతో ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఖర్చుల కంటే ఆదాయాన్ని పెంచుకోవడానికి తమ కంపెనీ ప్రణాళికలు రూపొందించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ షుల్మాన్ చెప్పారు. పేపాల్ ప్లాట్‌ఫారమ్‌లో చెల్లింపుల పరిమాణం గత సంవత్సరం 1.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని కంపెనీ నివేదించింది.
Updated Date - 2023-02-01T09:47:54+05:30 IST