Poco C55: భారత్‌లో అమ్మకానికొచ్చేసిన పోకో సి55.. ఫ్లిప్‌కార్ట్ సూపర్ ఆఫర్!
ABN, First Publish Date - 2023-02-28T17:38:24+05:30
పోకో సి55(Poco C55) ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఇండియాలో
న్యూఢిల్లీ: పోకో సి55(Poco C55) ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఇండియాలో ఫ్లిప్‌కార్డ్(Flipkart) ద్వారా అందుబాటులోకి వచ్చేసింది. ఫారెస్ట్ గ్రీన్, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ స్టోరేజీ వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ+64జీబీ వేరియంట్‌పై పోకో(Poco) తొలి రోజు ఫ్లాట్ రూ. 500 రాయితీ ప్రకటించింది. దీంతోపాటు డెబిట్, కెడిట్ కార్డులపై 4జీబీ, 6జీబీ ఫోన్లను కొనుగోలు చేస్తే వరుసగా రూ. 500, రూ. 1000 ఆఫర్ లభిస్తుందని తెలిపింది. ఫలితంగా 4జీబీ వేరియంట్‌ను రూ. 8,499, 6జీబీ వేరియంట్‌ను రూ. 9,999కి సొంతం చేసుకోవచ్చు.
పోకో సి55 స్పెసిఫికేషన్లు: మీడియా టెక్ హెలియో జి85 చిప్‌సెట్, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డుతో స్టోరేజీ పెంచుకునే వెసులుబాటు, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, . రియర్ ఫింగ్‌ప్రింట్ సెన్సార్, 6.71 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ప్యానెల్, 50 ఎంపీ డ్యూయల్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్స్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
Updated Date - 2023-02-28T17:38:24+05:30 IST