RBI: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇప్పటివరకు ఎంత సొమ్ము తిరిగి వచ్చిందంటే..?
ABN, First Publish Date - 2023-08-01T19:48:09+05:30
2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ(Reserve Bank of India) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 88 శాతం రూ.2 వేల నోట్లు(Rs 2,000 notes) తిరిగి బ్యాంకులకు చేరినట్టు వెల్లడించింది. వాటి విలువ రూ.3.14 లక్షల కోట్లుగా తెలిపింది.
రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ(Reserve Bank of India) కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 88 శాతం రూ.2 వేల నోట్లు(Rs 2,000 notes) తిరిగి బ్యాంకులకు చేరినట్టు వెల్లడించింది. వాటి విలువ రూ.3.14 లక్షల కోట్లుగా తెలిపింది. అయితే ఇంకా రూ.420 కోట్లు విలువైన రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ(RBI) పేర్కొంది. కాగా రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకోనున్నట్లు మే 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.2 వేల నోట్లు ఉన్న వారంతా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం లేదా మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ గడువు విధించింది. అయితే ఆ లోపు రూ.2 వేల నోట్లు యథావిథంగా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది కాగా మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే మే 19 నాటికి ఆ సంఖ్య రూ.3.56 లక్షల కోట్లకు తగ్గిందని పేర్కొంది.
ప్రధాన బ్యాంకుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు బ్యాంకుల్లోకి వచ్చిన రూ.2 వేల నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయని, 13 శాతం ఇతరత్రా మార్గాల్లో మార్పిడి అయినట్లు ఆర్బీఐ తెలిపింది. కాగా 2016లో నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐ 2 వేల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రూ.2 వేల నోట్లు ఆరు సంవత్సరాలకుపైగా చలామణిలో ఉన్నాయి. ఇక ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో సెప్టెంబర్ 30 తర్వాత రూ.2 వేల నోట్లు చలామణిలో ఉండే అవకాశాలు లేవు. కాగా 2020 నుంచే 2 వేల నోట్ల ముద్రణను నిలిపివేశారు.
Updated Date - 2023-08-01T19:48:09+05:30 IST