ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SEBI: మార్కెట్ వ్యవస్థ గాడి తప్పకుండా చూస్తామన్న సెబీ

ABN, First Publish Date - 2023-02-04T23:14:40+05:30

గడచిన మూడేళ్ల కాలంలో భారత మార్కెట్లు సానుకూలంగా స్పందించాయని సెబీ వ్యాఖ్యానించింది. అయితే గత వారంలో ఒక భారీ వ్యాపార సంస్థకు చెందిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) ద్వారా కార్యకలాపాలు నిర్వహించే భారత ఆర్థిక మార్కెట్ (Indian financial market) స్థిరమైన పనితీరును కనబరుస్తూ పారదర్శకంగా, సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని సెబీ (SEBI) ఒక ప్రకటనలో పేర్కొంది. దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లు (Stock market investors) సైతం ఆశాభావంతో ఉన్నారని అభిప్రాయపడింది. డాలర్ మాధ్యమంగా నడిచే అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లు, భారత్‌తో సమానమైన దేశాల మార్కెట్లను గమనిస్తే గడచిన మూడేళ్ల కాలంలో భారత మార్కెట్లు సానుకూలంగా స్పందించాయని సెబీ వ్యాఖ్యానించింది. అయితే గత వారంలో ఒక భారీ వ్యాపార సంస్థకు (అదానీ గ్రూప్ Adani Group సంస్థలను ఉద్దేశించి...) చెందిన స్టాక్స్ ధరల్లో అనూహ్యమైన మార్పులను గమనించామంది. నిర్దిష్ట స్టాక్స్‌లో ఒడిదుడుకులను గమనిస్తూ, పరిస్థితులు గాడి తప్పకుండా చూసేందుకు నిఘా వ్యవస్థల్ని సిద్ధం చేయడం జరిగిందని, ప్రత్యేక పరిస్థితుల్లో ఏ స్టాక్ ధరల్లో అయినా తీవ్ర ఒడిదుడుకులు చోటు చేసుకున్నప్పుడు ఈ వ్యవస్థ తనంత తానుగా క్రియాశీలం అవుతుందని సెబీ తెలిపింది. ఇలాంటి పరిణామాలు సంభవించినప్పుడు అందుకు సంబంధించి లభించే సమాచారాన్ని సెబీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రామాణిక విధానాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులోనూ ఈ చర్యల్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ కార్యకలాపాలపై హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలు, అనంతర పరిణామాల నేపథ్యంలో సెబీ ఈ ప్రకటన వెలువరించింది.

Updated Date - 2023-02-04T23:14:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising